Telangana: డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ తప్పించుకునే ప్రయత్నంలో ఘోర ప్రమాదం.. బస్సు ‘ఢీ’ కొని వ్యక్తి మృతి

|

Jun 08, 2023 | 8:49 AM

కరీంనగర్‌లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం సేవించిన ఓ వ్యక్తి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తోన్న పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టాడు. ఈ దుర్ఘటనలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకెళ్తే..

Telangana: డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ తప్పించుకునే ప్రయత్నంలో ఘోర ప్రమాదం.. బస్సు ఢీ కొని వ్యక్తి మృతి
Drunk And Driving
Follow us on

కరీంనగర్‌లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం సేవించిన ఓ వ్యక్తి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తోన్న పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టాడు. ఈ దుర్ఘటనలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకెళ్తే..

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం పోతిరెడ్డిపేటకు చెందిన ఎలువాక శ్రీనివాస్‌ (33) స్థానికంగా వెల్డింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తన బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఆ సమయంలో అతను మద్యం సేవించి ఉన్నాడు. బద్దం ఎల్లారెడ్డి చౌరస్తా సమీపంలో పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తుండటాన్ని శ్రీనివాస్‌ గమనించాడు. వెంటనే పోలీసుల కంట పడకుండా బైక్‌ను వెనక్కి మళ్లించాడు. పోలీసులను తప్పించుకునే యత్నంలో శ్రీనివాస్‌ ఎదురుగా వస్తున్న హుజూరాబాద్‌ డిపో ఆర్టీసీ బస్సును గమనించలేదు. బస్సును వేగంగా ఢీ కొట్టడంతో శ్రీనివాస్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

పోలీసుల వల్లనే అతను మృతి చెందాడని స్థానికులు ఆందోళన చేపట్టారు. ఏసీపీ శ్రీనివాసరావు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులకు సర్థిచెప్పి, ఆందోళన విరమింపజేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా రోడ్డు ప్రమాదాల నివారణకు ఇటీవల ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. రాత్రి మొదలుకొని ఉదయం మూడు గంటల వరకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.