నిజామామాద్‌లో విషాదం: చెల్లెలు కనిపించకుండా పోయిందనీ.. బెంగతో ఆగిన అన్న గుండె!

|

Jul 12, 2023 | 8:52 AM

అసలుసిసలైన అన్నా చెల్లెల్ల బంధానికి ఈ కథనం నిదర్శనం. అల్లారుముద్దుగా పెంచుకున్న చెల్లెలు కనిపించకుండా పోయిందని ఆ అన్న తట్టుకోలేకపోయాడు. ఇక ఎప్పటికీ తిరిగా రాదేమోనని కలత చెందిన అన్న గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ హృదయవిదారక..

నిజామామాద్‌లో విషాదం: చెల్లెలు కనిపించకుండా పోయిందనీ.. బెంగతో ఆగిన అన్న గుండె!
Naresh And Anitha
Follow us on

నిజామాబాద్‌: అసలుసిసలైన అన్నా చెల్లెల్ల బంధానికి ఈ కథనం నిదర్శనం. అల్లారుముద్దుగా పెంచుకున్న చెల్లెలు కనిపించకుండా పోయిందని ఆ అన్న తట్టుకోలేకపోయాడు. ఇక ఎప్పటికీ తిరిగా రాదేమోనని కలత చెందిన అన్న గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ హృదయవిదారక ఘటన నిజామాబాద్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలం హనుమాన్‌ఫారానికి చెందిన గంగమ్మ, భోజయ్య దంపతులకు నరేశ్, అనిత సంతానం. 20 ఏళ్ల క్రితం తల్లి గంగమ్మ పాముకాటుతో మరణించింది. తండ్రి కూడా కుటుంబానికి దూరమయ్యాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు దూరమవడంతో అన్నాచెల్లెలు ఒకరికి ఒకరు ప్రాణంగా బతికారు. నానమ్మ వద్ద ఉంటూ చెల్లెలు అనితను నరేశ్‌ అల్లారు ముద్దుగా చూసుకున్నాడు. 9 ఏళ్ల క్రితం నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన రాజుతో చెల్లెలు అనితకు వివాహం జరిపించాడు నరేశ్‌. చెల్లెలికి ఏడేళ్ల కొడుకు రేశ్వంత్ ఉన్నారు. నరేశ్‌ కూడా ఆటో డ్రైవర్‌గా పని చేసుకుంటూ భార్య, కొడుకు, కూతురుతో జీవనం సాగిస్తున్నాడు. అంతా ఆనందంగా ఉన్నారనుకునే సమయంలో విధికి కన్నుకుట్టిందేమో ఉన్నట్లుండి చెల్లెలు కాపురంలో కలతలు రేగాయి.

జులై 2న అనిత తన భర్త, కొడుకుతో కలిసి అన్నయ్య ఇంటికి వచ్చింది. ఆమె భర్త రాజు అదే రోజు తిరిగి బైంసా వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజే తాను కూడా వెళ్తానని చెప్పడంతో నవీపేటలో అన్నయ్య నరేశ్‌ బస్సు ఎక్కించాడు. ఐతే ఆమె భర్త ఇంటికి చేరలేదు. చెల్లెలు కనిపించకుండా పోయిందనే విషయం తెలుసుకున్న నరేశ్‌ ఎక్కడెక్కడో వెతికాడు. పోలీసులకు సైతం ఫిర్యాదు చేశాడు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో మనోవేధనకు గురై ఆదివారం రాత్రి గుండె పోటుతో మృతి చెందాడు. చెల్లెలిపై బెంగతో అన్న మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.