AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: యాదాద్రి పుణ్యక్షేత్రంలో సెల్ ఫోన్లు నిషేధం… కారణం ఇదే!

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో పోలీసు భద్రతను పెంచుతోంది. మరోవైపు యాదాద్రి ఆలయంలోకి సెల్ ఫోన్లు నిషేధిస్తూ అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో..

Telangana: యాదాద్రి పుణ్యక్షేత్రంలో సెల్ ఫోన్లు నిషేధం... కారణం ఇదే!
Mobile Phones Banned Inside Yadagirigutta
M Revan Reddy
| Edited By: |

Updated on: Apr 09, 2024 | 5:04 PM

Share

యాదగిరిగుట్ట, ఏప్రిల్‌ 9: ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో పోలీసు భద్రతను పెంచుతోంది. మరోవైపు యాదాద్రి ఆలయంలోకి సెల్ ఫోన్లు నిషేధిస్తూ అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో నిరంతర భద్రత, నిఘా కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పటికే సీసీకెమెరాల ద్వారా ప్రధాన ఆలయంతోపాటు కొండ దిగువన సత్యనారాయణ వ్రత మండపం, పుష్కరిణీ వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు భద్రతా చర్యల్లో భాగంగా భక్తుల లగేజీ పరిశీలనకు స్కానర్లు, హ్యాండిల్ మెటల్ డిటెక్టర్లు లాంటి ప్రత్యేక పరికరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఆలయ పునర్నిర్మాణం తర్వాత యాదాద్రికి లక్షలాదిగా తరలి వస్తున్న భక్తుల భద్రతకు అధికారులు పెద్దపీట వేస్తున్నారు. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. మరోవైపు ప్రధానాలయంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయడంలో భాగంగా తాజాగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయంలో సెల్ ఫోన్లు నిషేధిస్తూ దేవస్థానం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ప్రధానాలయంలోకి అర్చకులు, మినిస్టీరియల్ సిబ్బంది, ఎస్.పి.ఎఫ్, హోంగార్డ్స్ తో పాటు విలేకరులు కూడా ఫోన్లు తీసుకువెళ్తున్నారు. కేవలం భక్తులు మాత్రమే ప్రధాన ఆలయంలోకి సెల్ ఫోన్లు తీసుకువెళ్లడం లేదు.

ఆలయ సిబ్బంది, ఎస్పీఎఫ్ పోలీసుల వద్ద ఉన్న ఫోన్లతో ప్రధానాలయ ఫోటోలను తీయడం, కొందరు భక్తులు సైతం ఫోటోలు దిగుతున్నారు. ఒక్కోసారి గర్భాలయాన్ని కూడా తమ ఫోన్లలో చిత్రీకరిస్తున్నారు. దీంతో కొన్ని భద్రతాపరమైన సమస్యలు వస్తున్నాయి. దీంతో ప్రధాన ఆలయంలో పూర్తిగా సెల్ ఫోన్లు నిషేధించాలని ఆలయ ఈవో భాస్కరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు కేవలం భక్తులకే ఈ రూల్ అమలవుతుండగా.. ప్రస్తుతం ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బందికి కూడా ఈ రూల్ వర్తింపజేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన ఆలయంలోకి ఎవరూ ఫోన్లతో రాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలంటూ భద్రతా సిబ్బందికి ఈవో ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించే సిబ్బంది ఎవరైనా సరే తమ ఫోన్లను బయటే పెట్టాలని ఈవో స్పష్టం చేశారు. మినిస్టీరియల్ సిబ్బంది, నాలుగవ తరగతి, ఎస్పిఎఫ్, హోంగార్డ్స్, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు విలేకరులు కూడా ఫోన్లు బయట భద్రపరుచుకోవాలని ఆయన సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.