Telangana Politics: అలా చేస్తే తక్షణమే విత్‌డ్రా చేసుకుంటాం.. మంత్రి హరీష్ రావుకు జగ్గారెడ్డి ఓపెన్ ఛాలెంజ్..
Telangana Politics: తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.

Telangana Politics: తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి రెండు వేల కోట్ల చొప్పున.. 10 నియోజకవర్గాలకు రూ. 20 వేల కోట్లు స్థానిక సంస్థలకు రిలిజ్ చేయాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే.. తన భార్యను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి విత్ డ్రా చేపిస్తానని మంత్రి హరీష్ రావుకు జగ్గారెడ్డి ఛాలెంజ్ విసిరారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై ఫైర్ అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులకు పదవులు వచ్చాయి కానీ.. పవర్ రాలేదని వ్యాఖ్యానించారు. మెదక్ లో ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నా.. నిధులు మాత్రం శూన్యం అని విమర్శించారు. ఎన్నికలు వస్తేనే జిల్లా ప్రజలకు హరీష్ రావు అందుబాటులో ఉంటారని ఎద్దేవా చేశారు. 230 ఓట్లు మెదక్‌లో కాంగ్రెస్ కు ఉన్నాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
గెలిచే ఓట్లు లేకున్నా తన భార్యను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ లో పెట్టానని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధిని ఎన్నికల బరిలో నిలిపాం కాబట్టే.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ లతో హరీష్ రావు మాట్లాడుతున్నారని విమర్శించారు. మరి రెండు సంవత్సరాల నుంచి వారితో హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన భార్య నిర్మలా జగ్గారెడ్డిని గెలిపిస్తే.. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాకు రూ. 20 వేల కోట్లు తీసుకుస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. స్థానిక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవం ఉండాలని, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఆటోమాటిక్‌గా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల విలువ పెరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధిని పెట్టడం వల్లే.. హరీష్ రావు తమ పార్టీ ఓటర్లకు ఫోన్లు చేస్తున్నారని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి రాజబతుకు బతుకుతారో.. టీఆర్ఎస్ ను గెలిపించి బానిస బతుకు బతుకుతారో మీరే తేల్చుకొండి.’’ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు జగ్గారెడ్డి సూచించారు.
Also read:
గ్యాస్ సమస్య తరచూ వేధిస్తోందా.. నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?
Rainfall: దక్షిణ భారతదేశంలో వర్షాల బీభత్సం.. ఒక్క నవంబర్‌లోనే 143.4 శాతం వానలు..
Corona Effect: వారి కుటుంబాల పునరావసం కోసం దాఖలైన పిటిషన్ పై కేంద్ర స్పందన కోరిన సుప్రీం కోర్టు