Telangana MLC Elections: ముగిసిన ఓ(నో)ట్ల పండుగ.. ఓటేసిన తరువాత దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన నేతలు..!

|

Dec 11, 2021 | 9:35 AM

Telangana MLC Elections: ఎన్నిక ముగిసింది.. అసలు ఘట్టానికి తెరపడింది. ఇక మిగిలింది తుది ఫలితమే. ఇప్పటికే బరిలో నిలిచిన అభ్యర్థులకు గెలుపు ఓటమిలపై ఓ క్లారిటీ కూడా వచ్చేసింది.

Telangana MLC Elections: ముగిసిన ఓ(నో)ట్ల పండుగ.. ఓటేసిన తరువాత దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన నేతలు..!
Elections
Follow us on

Telangana MLC Elections: ఎన్నిక ముగిసింది.. అసలు ఘట్టానికి తెరపడింది. ఇక మిగిలింది తుది ఫలితమే. ఇప్పటికే బరిలో నిలిచిన అభ్యర్థులకు గెలుపు ఓటమిలపై ఓ క్లారిటీ కూడా వచ్చేసింది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం నామినేషన్ విత్ డ్రాలో చోటు చేసుకున్న ట్విస్ట్ లు ఎన్నికల పోలింగ్ చివరి వరకు సాగడంతో ఏ జరగబోతుందో అన్న టెన్షన్ అయితే కంటిన్యూ అవుతోంది. భారీ ఆశలతో నామినేషన్ వేసిన కొందరు అభ్యర్థులు భారీ ఆఫర్ లతో మద్యలోనే చాపచుట్టేయగా.. బరిలో మిగిలిన ఆ ఒక్క అభ్యర్థి మాత్రం గట్టి ప్రయత్నమే చేశారని టాక్. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ చోటు చేసుకుందంట. బరిలో నిలిచిన స్వతంత్ర్య అభ్యర్థిని సాకుగా చూపి భారీగా లాభపడాలని స్కెచ్ లు వేశారంటా కొందరు నేతలు. అయితే అదికార పార్టీ నేతలు సైతం సరే అట్లాగే కానివ్వండి అన్న రేంజ్ లో ఆఫర్లిచ్చారట. సీన్ కట్ చేస్తే స్వతంత్ర్య అభ్యర్థి సైలెంట్ అయ్యారంటూ సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరగడం.. క్యాంపులను సైతం రద్దు చేసుకుని అదికార పార్టీ ఓటర్లు ఇంటి దారి పట్టడంతో.. భారీగా ముడుపులు అందుతాయని బావించిన ఆ కొందరు నేతలకు, ఆ కొంత మంది ఎమ్మెల్సీ ఓటర్లకు చివరకి ఊహించని షాక్ తగిలిందట.

మరోవైపు జిల్లా కేంద్రంలోని ఓ నేత అధికార పార్టీ నుండి భారీగానే ముడుపులు అందుకోవడంతో మా వాట ఏదని అడిగిన కొందరు ఓటర్లకు ఆ ఒక్కటి అడక్కు అన్న రేంజ్ లో ఆ జిల్లా అధ్యక్షుడి నుండి సమాదానం రావడం.. ఆ నేత రిక్త హస్తాలు చూపించడంతో కంగుతిన్నారట సదరు ఓటర్లు. ఉదయం తెగ జోష్ తో తమ ఓటు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రం వరకు‌ వచ్చిన ఆ కొందరు ఓటర్లు ముడుపుల కథ కంచికి చేరడంతో ఓటు హక్కు వినియోగించుకోకుండానే ఇంటి దారి పట్టినట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారగా.. అటు మంచిర్యాల, బెల్లంపల్లిలోను ఇదే తరహా రాజకీయం సాగినట్టు సమాచారం.

ఉమ్మడి ఆదిలాబాద్ లో 937 ఓట్లకు గాను 860 ఓట్లు పోలవగా.. ఎవరు ఊహించని విధంగా నిర్మల్ లో వంద శాతం ఓటింగ్ పోలవడం.. అక్కడ అదికార పార్టీ మీద గుర్రుగా ఉన్న కొందరు ఎంపిటీసీలు, జెడ్పీటీసీలు ఓ నేత అభయంతో క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అయితే అదంతా ఎన్నికల ఫలితాల తరువాత తేటతెల్లమయ్యే అంశమే అయినప్పటికీ మంత్రి ఇలాకాలో వంద శాతం ఓటింగ్ అదికార పార్టీకి కలిసి వచ్చే అంశమేనా లేక నిండా ముంచే అస్త్రమా అన్న రూమర్స్ కూడా చెక్కర్లు కొడుతున్నాయి. అయితే నిర్మల్ కు చెందిన ఓ నేతను బరిలో నుండి తప్పుకుని మరో అభ్యర్థికి మద్దతు తెలిపితే మీరడిగినంత ఓకే అంటూ అభయం ఇచ్చి.. తీరా ఓటు వేసి వచ్చాక ఫలితం తరువాత చూద్దాం అంటూ జారుకున్నాడంటూ టాక్ నడుస్తోంది. తీరా ఓటు వేసి మోసపోయామే అని నిర్మల్ లోని ఆ కొందరు ఓటర్లు మదన పడుతున్నట్టు సమాచారం. మరీ ఆ ఒక్కటి ఆశించి భంగపడ్డ ఆ కొందరు ఓటర్ల ఓట్ల బలం ఏ మేర ఫలితంపై ప్రభావం చూపుతుందో చూడాలి‌.

ఇక మంచిర్యాల, ఆదిలాబాద్ లో మినహాయిస్తే మిగతా పోలింగ్ కేంద్రాల్లో భారీగానే ఓటింగ్ పోలవడం, ఒకరు ఇద్దరు తప్ప మిగిలిన వారంతా ఓటింగ్ కు హాజరవడం.. అదికార పార్టీ ఓటర్లంతా తూచ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవడంతో అదికార పార్టీ ఆశిస్తున్నట్టు విజయం ఖాయమే అయినా ఏస్థాయి విజయం దక్కుతుందనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల పండుగ ఓటర్లకైతే నోట్ల పండుగగా మారిందనే ప్రచారం మాత్రం స్టిల్ కంటిన్యూ అవుతోంది. స్వతంత్ర్య అభ్యర్థి ఇంకాస్త బలంగా నిలబడితే మేమంతా కాస్తొకూస్తో బలపడే వాళ్లం కదా అని ఆదిలాబాద్ స్థానిక‌ సంస్థల ఓటర్లు తెగ మదనపడిపోతున్నారట. మళ్లీ ఎప్పుడొస్తుందో ఇలాంటి ఓ(నో)ట్ల పండుగ అంటూ నిట్టూరుస్తున్నారట!

నరేష్ స్వేన, టీవీ9 తెలుగు, ఉమ్మడి ఆదిలాబాద్ రిపోర్టర్.

Also read:

Nayanthara: మరో కొత్త వ్యాపారంలోకి లేడీ సూపర్‌ స్టార్‌.. బ్యూటీ బిజినెస్‌లో పెట్టుబడులు..

Semiconductor: సెమీకండక్టర్ అంటే ఏమిటి.. వాటి కొరత ఎందుకు వచ్చింది..?

Pushpa Item Song: యూట్యూబ్‎ను షేక్ చేస్తున్న సమంత ఐటెమ్ సాంగ్.. ఈ పాట పాడిన ఫోక్ సింగర్ ఎవరో తెలుసా..