తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం యావత్ దేశానికే ఆదర్శం అని రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి అని అన్నారు. దేశంలో నేరుగా రైతుల ఖాతాలలో జమ చేస్తున్న మొట్టమొదటి పథకం అని అన్నారు. ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. డిసెంబర్ 28 నుంచి రైతు బంధు పథకం డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. దేశంలో నేరుగా రైతుల ఖాతాలలో జమ చేస్తున్న మొట్టమొదటి పథకం రైతుబంధు అని పేర్కొన్నారు. అన్నంపెట్టే రైతు అప్పులపాలు కాకూడదని, రైతు యాచించే స్థితిలో కాదు శాసించే స్థాయిలో ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు 9 విడతలలో రూ. 58వేల కోట్లు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. 10వ విడతతో దాదాపు రూ. 66వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలలోకి జమ అవుతాయన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.
రైతుబంధు, రైతుభీమా, సాగునీటి సదుపాయం, 24 గంటల ఉచిత కరంటుతో తెలంగాణ రైతులలో ఆత్మస్థైర్యం పెరిగిందన్నారు మంత్రి. వ్యవసాయరంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న చేయూత దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదన్నారు. 60 శాతం మందికి ఉపాధి కల్పించే వ్యవసాయరంగానికి చేయూత ఇవ్వాలన్నదే కేసీఆర్ ఆలోచనగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకున్నా తెలంగాణలో సంక్షేమ, అభివృద్ధి పథకాలను కేసీఆర్ విజయవంతంగా అమలుచేస్తున్నారని తెలిపారు మంత్రి.
పదోవిడత రైతుబంధులో 65 లక్షల మంది పైచిలుకు రైతుల ఖాతాలకు రూ.7600 కోట్లు జమ చేయడం జరుగుతుందని వివరించారు మంత్రి నిరంజన్ రెడ్డి. డిసెంబర్ 28 నుండి రోజుకు ఎకరా చొప్పున రైతుల ఖాతాలలో నిధులు జమ అవుతాయన్నారు. సంక్రాంతి లోపు అందరు రైతుల ఖాతాలలో నిధులు జమ అవుతాయన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..