KTR Tweet: బుడ్డోడి ఆత్మ విశ్వాసానికి మంత్రి కేటీఆర్ ఫిదా.. వీడియో ట్వీట్ చేస్తూ ప్రశంసలు..

|

Sep 23, 2021 | 2:30 PM

Minister KTR Tweet: ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు’ అనే పాట మనందరికీ తెలిసిందే. ఈ పాటకు సరిగ్గా సూట్ అయ్యే బుడ్డోడిని చూసి తెలంగాణ

KTR Tweet: బుడ్డోడి ఆత్మ విశ్వాసానికి మంత్రి కేటీఆర్ ఫిదా.. వీడియో ట్వీట్ చేస్తూ ప్రశంసలు..
Child
Follow us on

Minister KTR Tweet: ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు’ అనే పాట మనందరికీ తెలిసిందే. ఈ పాటకు సరిగ్గా సూట్ అయ్యే బుడ్డోడిని చూసి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఫిదా అయిపోయారు. ఆ బాలుడి ఆత్మవిశ్వాసానికి సలాం కొట్టారు. అంతేకాదు.. ఆ చిన్నవాడికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. మంచి ఫ్యూచర్ ఉందంటూ కితాబిచ్చారు.

మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో మనందరికీ తెలిసిందే. ఉన్న అన్ని అవకాశాలనూ వినియోగించుకుని ఆయన ప్రజాసేవ సాగిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎవరైనా తన సాయం కోరితే కాదనకుండా అండగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు సైతం సాయం కోరితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రెస్పాండ్ అవుతుంటారు మంత్రి కేటీఆర్. అదే సమయంలో కొన్ని కొన్ని అంశాలపై చాలా సరదాగా కూడా రెస్పాండ్ అవుతుంటారు. తాజాగా మంత్రి కేటీఆర్ కంట జగిత్యాలకు చెందిన ఓ బాలుడి వీడియో పడింది. ఆ వీడియోలో బాలుడు చెప్పిన మాటలు విని మంత్రి ఆశ్చర్యపోయారు. మంచి ఫ్యూచర్ ఉందంటూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు.

జగిత్యాలకు జిల్లాకు చెందిన 9వ తరగతి విద్యార్థి ప్రకాష్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. జగిత్యాలకు చెందిన ఈ వీడియో బాగా నచ్చింది అని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఆ వీడియో ఉన్న బాలుడిపై ప్రశంసలు కురిపించారు. ‘‘జగిత్యాలలోని ప్రభుత్వం పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఈ బాలుడి పేరు జై ప్రకాశ్. పేపర్ వేస్తూ చదువుకుంటున్నాడు. అతని ఆత్మవిశ్వాసం, ప్రశాంత చిత్తం, ఆలోచనా విధానం, వ్యక్తీకరణ, స్పష్టత నాకు బాగా నచ్చాయి. ‘చదువుతూ పని చేయడంలో తప్పేముంది. ఇప్పుడు కష్టపడితే భవిష్యత్‌లో మంచి స్థితిలో ఉంటాను’ అని బాలుడు చెప్పాడు. అతని ఆత్మవిశ్వాసం నన్ను బాగా ఆకట్టుకుంది.’’ అంటూ మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి మంచి రెస్పాండ్స్ వస్తుంది. జై ప్రకాష్‌కు చేయూత ఇవ్వాల్సిందిగా పలువురు సూచిస్తున్నారు.

KTR Tweet:

Also read:

Viral Video: పెంపుడు కుక్కను కిడ్నాప్ చేసిన కోతి.. మూడు రోజులు పాటు తన చెరలో ఉంచుకుని ఆ తరువాత..

Viral News: బాయ్ ఫ్రెండ్ కోసం ఇంత దారుణమా?.. పొట్టు పొట్టుగా కొట్టుకున్న యువతులు.. షాకింగ్ వీడియో మీకోసం..

Bride Escape: తప్పతాగి పెళ్లికి సిద్ధమైన వరుడు.. అదును చూసి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వధువు..