KTR: హైదరాబాద్‌ వ్యాక్సిన్‌ రాజధాని అని చెప్పుకోవడం గర్వంగా ఉంది.. ‘బయో ఎషియా’లో మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు..

|

Feb 22, 2021 | 1:03 PM

KTR Speech At Bio Asia Summit: హైదరాబాద్‌ వేదికగా జరిగే బయో ఎషియా సదస్సు సోమవారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు ప్రపంచ నలుమూలల నుంచి...

KTR: హైదరాబాద్‌ వ్యాక్సిన్‌ రాజధాని అని చెప్పుకోవడం గర్వంగా ఉంది.. బయో ఎషియాలో మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు..
Follow us on

KTR Speech At Bio Asia Summit: హైదరాబాద్‌ వేదికగా జరిగే బయో ఎషియా సదస్సు సోమవారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు ప్రపంచ నలుమూలల నుంచి సుమారు 30 వేల మంది పాల్గొంటున్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి సదస్సును వర్చువల్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. తెలంగాణ పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్‌ రాజధానికిగా హైదరాబాద్‌ అని చెప్పుకోవడం నాకెంతో గర్వకారణమని మంత్రి వ్యాఖ్యానించారు.
ఇక కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. కోవిడ్ – 19 మహమ్మారి నివారణకు దేశీయ వ్యాక్సిన్ ను అందుబాటులో కి తీసుకొచ్చిన భారత్ బయో టెక్ కృషి మనందరికీ ఎంతో గర్వకారణమని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆరబిందో ఫార్మా, సింజీన్‌, బీవీకే బయో వంటి కంపెనీలు హైదరాబాద్‌లో మరింత విస్తరణకు పాటుపడటం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ఇక లైఫ్ సైన్సెస్ సెక్టార్‌లో తెలంగాణ వేగంగా స్పందించి అత్యుత్తమ పరిష్కారాలతో ముందుకొచ్చిందని మంత్రి గుర్తు చేశారు. సుల్తాన్‌ పూర్‌లో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న మెడికల్‌ ఉపకరణాల పార్క్‌ను వచ్చే నెలలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో ఫార్మా సూటికల్‌ సెక్టార్‌ బలోపేతానికి జీనోమ్‌ వ్యాలీలో బయో ఫార్మా హబ్‌, బీ-హబ్‌ను ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.
ఇక హైదరాబాద్‌ వేదికగా జరిగే బయో ఏషియా సదస్సును కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ నేపథ్యంలో ‘మూవ్‌ ద నీడిల్‌’ థీమ్‌తో నిర్వహిస్తున్నారు. బేగంపేటలోని హాటల్‌ ఐటీసీ కాకతీయలో ఈ సదస్సు సోమవారం ప్రారంభమైంది. 18వ సారి నిర్వహిస్తున్న ఈ సదస్సులో జీవ శాస్త్రాల పరిశోధనల్లో ప్రగతి, ఆరోగ్య పరిరక్షణ, ఔషధరంగం అభివృద్ధి, కరోనా తదనంతర సవాళ్లను ఎదుర్కోవటంలో ఫార్మారంగం పాత్ర తదితర అంశాలపై నిపుణులు చర్చించనున్నారు.

Also Read: ఇదీ డిజిటల్ ఇండియా స్థితి ! ఫోన్ సిగ్నల్ కోసం 50 అడుగుల ఎత్తున స్తంభమెక్కి కూర్చున్న మధ్యప్రదేశ్ మంత్రి