Telangana: గ్యాస్ ధరల పెంపుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం.. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు..

|

Mar 02, 2023 | 11:04 AM

నల్లధనం బయటికి తీయడమేమో గానీ... పోప్‌ డబ్బాల్లో మహిళలు దాచుకున్న డబ్బును మాత్రం మోదీ బయటికి తీయిస్తున్నారన్నారు కేటీఆర్‌. మహిళా దినోత్సవంరోజు మహిళలకు మంచి గిఫ్టే ఇచ్చారంటూ..

Telangana: గ్యాస్ ధరల పెంపుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం.. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు..
Minister KTR
Follow us on

నల్లధనం బయటికి తీయడమేమో గానీ… పోప్‌ డబ్బాల్లో మహిళలు దాచుకున్న డబ్బును మాత్రం మోదీ బయటికి తీయిస్తున్నారన్నారు కేటీఆర్‌. మహిళా దినోత్సవంరోజు మహిళలకు మంచి గిఫ్టే ఇచ్చారంటూ మోదీపై సెటైర్లు వేశారు. గ్యాస్‌ సిలిండర్ల ధరల పెంపుపై కేంద్రానికి ప్రశ్నలు సంధించిన కేటీఆర్‌ స్టేట్‌వైడ్‌గా నిరసనలకు పిలుపునిచ్చారు.

ఎల్పీజీ ధరలపై యుద్ధం ప్రకటించింది బీఆర్‌ఎస్‌. రేపు స్టేట్‌వైడ్‌గా ఆందోళనలు చేపట్టబోతోంది. గ్యాస్‌ ధరల పెంపును వ్యతిరేకిస్తూ నియోజకవర్గ, పట్టణ, మండల కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులుతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన కేటీఆర్‌, పెంచిన గ్యాస్‌ ధరలపై ఢిల్లీకి వినిపించేలా గళమెత్తాలని సూచించారు. కేంద్రాన్ని నిలదీస్తూ వినూత్నంగా నిరసనలు తెలపాలన్నారు. కేంద్రం ఏవిధంగా ధరలు పెంచుతూ పోతుందో ప్రజలకు వివరించాలన్నారు.

ఎన్నికలు అయిపోగానే గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు పెంచడం మోదీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు కేటీఆర్‌. త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ ఎన్నికలు ముగియగానే ఎల్పీజీ ధరలు పెంచేశారంటూ నిప్పులు చెరిగారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మోదీ ఇచ్చిన కానుక ఇదేనా అంటూ సెటైర్లు వేశారు కేటీఆర్‌. డొమెస్టిక్‌ సిలిండర్‌పై యాభై రూపాయలు, కమర్షియల్‌ సిలిండర్‌పై 350 రూపాయలు పెంచడం దారుణమన్నారు. మోదీ గవర్నమెంట్‌ రాకముందు ఎల్పీజీ సిలిండర్‌ ధర నాలుగు వందలుంటే ఇప్పుడది 12వందలకు చేరిందని గుర్తుచేశారు కేటీఆర్‌.

ఇవి కూడా చదవండి

నల్లధనం వెలికితీయడమేమో గానీ.. పోప్‌ డబ్బాల్లో మహిళలు దాచుకున్న డబ్బును మాత్రం మోదీ బయటికి తీయిస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు మహిళా మంత్రులు.

ఒకవైపు ఉజ్వల స్కీమ్‌ పేరుతో మాయ మాటలు చెబుతూ.. మరోవైపు భారీగా గ్యాస్‌ ధరలు పెంచడం వెనక అసలు ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు కేటీఆర్‌. పేదలు, సామాన్యులకు గ్యాస్‌ను దూరం చేయడమే మోదీ సర్కార్‌ లక్ష్యమా అంటూ నిలదీశారు. మోదీ చేతుల మీదుగా ఎల్పీజీ కనెక్షన్‌ తీసుకున్న మహిళ ఇప్పుడు సిలిండర్‌ కొనలేక కట్టెల పొయ్యిపై వంట చేస్తోందన్నారు. ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుని అడ్డగోలుగా పెంచిన గ్యాస్‌ ధరలను తగ్గించాలంటున్నారు కేటీఆర్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..