Telangana Minister KTR: బండి సంజయ్ ప్రమాణంతో యాదాద్రి మలినం.. షాకింగ్ కామెంట్స్ చేసిన మంత్రి కేటీఆర్..

|

Oct 29, 2022 | 6:39 PM

మొయినాబాద్‌ ఫామ్‌ హౌజ్‌ ఇష్యూ ఓవైపు.. మునుగోడు ఉపఎన్నిక మరోవైపు.. వెరసి తెలంగాణ పాలిటిక్స్‌లో మోత మోగిస్తోంది. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య మాటలు తూటాలు టెన్‌థౌజండ్‌ వాలా రేంజ్‌లో పేలుతున్నాయి.

Telangana Minister KTR: బండి సంజయ్ ప్రమాణంతో యాదాద్రి మలినం.. షాకింగ్ కామెంట్స్ చేసిన మంత్రి కేటీఆర్..
Minister Ktr
Follow us on

మొయినాబాద్‌ ఫామ్‌ హౌజ్‌ ఇష్యూ ఓవైపు.. మునుగోడు ఉపఎన్నిక మరోవైపు.. వెరసి తెలంగాణ పాలిటిక్స్‌లో మోత మోగిస్తోంది. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య మాటలు తూటాలు టెన్‌థౌజండ్‌ వాలా రేంజ్‌లో పేలుతున్నాయి. ఈ అంశంపై తొలిసారి స్పందించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌.. బీజేపీ నేతల వ్యాఖ్యలకు స్ట్రాంగ్‌ కౌంటర్లు ఇచ్చారు. ముఖ్యంగా యాదాద్రిలో బండి సంజయ్‌ చేసిన ప్రమాణంపై తనదైన స్టయిల్‌లో స్పందించారు మంత్రి కేటీఆర్‌. ఫామ్‌హౌస్‌ డీల్‌లో బండి సంజయ్‌ సవాల్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు మంత్రి కౌంటర్‌. అమిత్‌షా చెప్పులు మోసిన చేతులతో ప్రమాణం చేయడం అంటే యాదాద్రిని అపవిత్రం చేయడమేనన్నారు. లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సంప్రోక్షణ చేయాలన్నారు. రేపిస్ట్‌లకే దండలు వేసి ఊరేగించిన బీజేపీ నేతలు చేసే ప్రమాణాలకు విలువ ఉండదని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్‌.

ఫామ్‌హౌస్ డీల్‌పై కేటీఆర్ కామెంట్స్..

ఇదే సమయంలో ఫామ్‌హౌస్ డీల్‌పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టం తన పని తాను చేస్తుందన్నారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నామని, తమకు బాధ్యత ఉందన్నారు. ఏదైనా మాట్లాడితే విచారణను ప్రభావితం చేస్తున్నామని అంటారని, అందుకే సీఎం గానీ, మంత్రులు గానీ స్పందించడం లేదన్నారు. దర్యాప్తు సంస్థలు, పోలీసులే ఈ అంశాన్ని తేలుస్తారని చెప్పారు మంత్రి. దొంగ ఎవరు, దొర ఎవరు అనేది ఆడియోల్లోనే బయట పడిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

మునుగోడు ఉపఎన్నికపై కేటీఆర్ స్పందన..

మునుగోడు ఉప ఎన్నికలో అసాధారణమైన పరిస్థితి కనిపిస్తోందన్నారు మంత్రి కేటీఆర్‌. మూడు పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయన్నారు. ఏం చేశామో, ఏం చేస్తామో తాము స్పష్టంగా చెబుతున్నామన్నారు మంత్రి కేటీఆర్. కానీ, విపక్షాలు మాత్రం వ్యక్తిగత దూషణలు, విమర్శలు మాత్రమే చేస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీపై ఛార్జిషీట్‌ను విడుదల చేశామని చెప్పారు. మిషన్‌ భగీరథకు రూ.19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసినా పట్టించుకోలేదని కేంద్రం తీరును తప్పుపట్టారు. నల్గొండ జిల్లాపై బీజేపీ కాఠిన్యం చూపిందని ఆరోపించారు. ఫ్లోరోసిస్‌ బాధితులను బీజేపీ పట్టించుకోలేదన్నారు. చేనేతపై పన్ను వేసిన తొలి ప్రధాని మోదీ అని విమర్శించారు. హ్యాండ్‌లూమ్‌ పార్క్‌ కడతానని కట్టలేదని ఆరోపించారు. యాదాద్రి పవర్‌ ప్రాజెక్ట్‌కు రుణాలు ఆపారని విమర్శించారు మంత్రి కేటీఆర్. ఇక తెలంగాణలో ఎంతో ముఖ్యమైన కృష్ణా జలాల పంపకాల్లో నికృష్టమైన రాజకీయం చేస్తోందని కేంద్రం తీరును తూర్పారబట్టారు. ఇదే సమయంలో ఇంధన ధరలు పెరగడంపై సెటైర్లు వేశారు మంత్రి. ముడి చమురు ధర పెరగలేదు కానీ, మోదీ చమురు ధర పెరిగింది’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..