KTR Harish Raod: ‘కరప్షన్‌కు కేరాఫ్ కాంగ్రెస్’.. రాహుల్ గాంధీ కామెంట్స్‌కు ఆమాత్యుల స్ట్రాంగ్ కౌంటర్..
ఖమ్మం కాంగ్రెస్ సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌పై మంత్రులు కేటీఆర్, హరీష్ రావు స్పందించారు. బీఆర్ఎస్ అంటే.. బీజేపీ బంధువుల పార్టీ అంటూ చేసిన కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. తమది బీజేపీ బంధువుల పార్టీ కాదని,
ఖమ్మం కాంగ్రెస్ సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌పై మంత్రులు కేటీఆర్, హరీష్ రావు స్పందించారు. బీఆర్ఎస్ అంటే.. బీజేపీ బంధువుల పార్టీ అంటూ చేసిన కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. తమది బీజేపీ బంధువుల పార్టీ కాదని, కాంగ్రెస్సే భారత రాబందుల పార్టీ అని ఘాటైన విమర్శలతో కౌంటర్ అటాక్ చేశారు. ఏఐసీసీ అంటేనే అఖిల భారత కరప్షన్ కమిటీ అని సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించి మంత్రి కేటీఆర్.. అవినీతి, అసమర్థతకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు అని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌లో స్కాముల చరిత్రను ప్రజలు మరిచిపోలేదని అన్నారు. తమ పార్టీ బీజేపీకి బీ టీమ్ కాదని, కాంగ్రెస్ పార్టీకి సీ టీమ్ అంతకన్నా కాదని అన్నారు. బీఆర్ఎస్‌ను ఢీకొట్టే దమ్ములేకనే బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి తమను కాల్చే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. అయితే ఆ ఫైర్ మిస్ ఫైర్ అయ్యి.. చివరకు అది కాంగ్రెస్‌నే కుప్పకూలుస్తుందని వ్యాఖ్యానించారు మంత్రి కేటీఆర్.
ఇక మంత్రి హరీష్ రావు సైతం అంతే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్ వేదికగానే కాంగ్రెస్‌కు ధీటైన కౌంటర్ ఇచ్చారు. రాహుల్ చేసిన కామెంట్స్‌ను తిప్పికొడుతూ.. దేశాన్ని దోచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని విమర్శించారు. అవినీతికి మారుపేరుగా కాంగ్రెస్ మారిందని, అందుకే కాంగ్రెస్ పేరు స్కాంగ్రెస్‌గా మారిందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ ఎవరికీ బీ టీమ్ కాదని, తమది పేద ప్రజల సంక్షేమం చూసే ఏ టీమ్ అని పేర్కొన్నారు హరీష్ రావు. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదని, అలాంటి బీజేపీ కబందహస్తాల నుంచి దేశాన్ని కాపాడేందుకే బీఆర్ఎస్ పుట్టిందన్నా మంత్రి హరీష్. రాహుల్‌గాంధీ ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని వ్యాఖ్యానించారు. ఇక పోడు పట్టాలపై కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్. పోడు పట్టాలను తాము ఇచ్చాక మళ్లీ మీరు ఇచ్చేది ఏంటి? అని ప్రశ్నించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..