Bjp vs Trs: ఎవరెన్ని కుట్రలు చేసిన ధర్మమే గెలుస్తుంది.. బీజేపీపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్..

Bjp vs Trs: బీజేపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా చివరకు ధర్మమే గెలుస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ సభను అడ్డుకోవడానికి..

Bjp vs Trs: ఎవరెన్ని కుట్రలు చేసిన ధర్మమే గెలుస్తుంది.. బీజేపీపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్..
Minister Jagadish Reddy

Updated on: Aug 27, 2022 | 3:00 PM

Bjp vs Trs: బీజేపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా చివరకు ధర్మమే గెలుస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ సభను అడ్డుకోవడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తోందంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు మంత్రి జగదీష్ రెడ్డి. జనమే లేని బీజేపీ సభలను అడ్డుకునే అవసరం తమకు లేదని కుండబద్దలుకొట్టారు. శనివారం సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి జగదీష్ రెడ్డి.. బీజేపీ నేతల కామెంట్స్‌పై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. అనుమతలు లేకుండా సభలు ఎలా జరుగుతాయో బీజేపీకి తెలియదా? అని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట వేస్తుంటే.. ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. కేసీఆర్ పై కుట్రతో రాష్ట్ర సంక్షేమాన్ని చీకట్లోకి నెట్టే ప్రయత్నం చేస్తోందని బీజేపీపై ఫైర్ అయ్యారు. ఆ పార్టీ దుర్మార్గపు సిద్ధాంతాలను వ్యతిరేకించే రాష్ట్రాలను కూల్చే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. దేశ ప్రజలంతా ఏకమై మోడీ దుశ్చర్యలను నిలదీయాల్సిన అవసరముందని అన్నారు.

ఇదిలాఉంటే.. వరంగల్‌లో బీజేపీ తలపెట్టిన బహిరంగ సభకు కాకతీయ యూనివర్సిటీ అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. దాంతో బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. సభను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సభ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది బీజేపీ. ఈ సభకు రాష్ట్ర పార్టీ నాయకులతో పాటు.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా వస్తున్నారు. ఈ సభ ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ హీట్‌ను అమాంతం పెంచేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..