Harishrao Review: ఉన్నతాధికారులతో మంత్రి హ‌రీష్ రావు భేటీ.. రాష్ట్రంలో కరోనా పరిస్థితలపై స‌మీక్ష

తెలంగాణలో వైరస్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటీకే లాక్‌డౌన్ విధించి కట్టుదిట్టమైన నిబంధనలు అమలు చేస్తోంది. ఇదే క్రమంలో ఇవాళ మంత్రి హరీష్ రావు క‌రోనాపై స‌మీక్ష...

Harishrao Review: ఉన్నతాధికారులతో మంత్రి హ‌రీష్ రావు భేటీ.. రాష్ట్రంలో కరోనా పరిస్థితలపై స‌మీక్ష

Updated on: May 18, 2021 | 2:26 PM

Minister Harish Rao review on Corona: తెలంగాణ ఉధృతి కొనసాగుతోంది. వైరస్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటీకే లాక్‌డౌన్ విధించి కట్టుదిట్టమైన నిబంధనలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా నిన్న ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇదే క్రమంలో ఇవాళ మంత్రి హరీష్ రావు తాత్కాలిక స‌చివాల‌యం బీఆర్కే భ‌వ‌న్‌లో క‌రోనాపై స‌మీక్ష నిర్వహించారు. ఈ స‌మావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి సోమేశ్ కుమార్‌తో పాటు వైద్యారోగ్య శాఖ‌ అధికారులు హాజ‌ర‌య్యారు.

ప్రస్తుతం కోవిడ్ చికిత్సకు సంబంధించి అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాలు, అందుబాటులో ఉన్న ఔష‌ధాల‌పై చ‌ర్చించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక స‌దుపాయాల‌పై కూడా చ‌ర్చించారు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ సదుపాయాలు, బెడ్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులను సమకూర్చాలని, ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ కంటే ముందు మంత్రి హ‌రీష్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్ కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిని సంద‌ర్శించారు. కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిని బ్లాక్ ఫంగ‌స్‌కు నోడ‌ల్ కేంద్రంగా ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.

Read Also…

తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌కు స్టైఫండ్ పెంపుతూ ఉత్త‌ర్వులు