Minister Harish Rao: రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు.. బ్యాంకర్లకు సూచించిన మంత్రి హరీష్ రావు..

|

Jul 05, 2021 | 12:17 PM

Minister Harish Rao: రైతులకు సకాలంలో రుణాలు అందించాచలని, రైతుబంధు, ఫించన్లు, పంట రుణాలలో కోత విధించొద్దని బ్యాంకర్లకు..

Minister Harish Rao: రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు.. బ్యాంకర్లకు సూచించిన మంత్రి హరీష్ రావు..
Harish Rao
Follow us on

Minister Harish Rao: రైతులకు సకాలంలో రుణాలు అందించాచలని, రైతుబంధు, ఫించన్లు, పంట రుణాలలో కోత విధించొద్దని బ్యాంకర్లకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు సూచించారు. సోమవారం నాడు సిద్ధిపేట జిల్లా ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంకు బ్రాంచ్‌ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. గత 17 నెలలుగా కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశ, రాష్ట్ర ప్రజానీకం కొట్టుమిట్టాడుతోందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పేద మధ్యతరగతి ప్రజలకు లోన్లు అందిస్తూ బ్యాంకులు ఆదుకోవాలని కోరారు. రైతు బంధు, ఆసరా పెన్షన్ లబ్దిదారులకు ఇబ్బందులు కలగకుండా బ్యాంకర్లు సహకరించాలని కోరారు.

త్వరలో ఫారెస్ట్ కళాశాలను ఫారెస్ట్ యూనివర్సిటీ చేసే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. విద్యార్థుల సౌలభ్యం కోసం కళాశాలలో బ్యాంకు సేవలు అందించాలన్నారు. అలాగే యూనివర్సిటీ ఆవరణలో ఏటీఎం ఏర్పాటుకు యూనివర్సిటీ అధికారులు బ్యాంకర్లకు సహకరించాలని మంత్రి సూచించారు.

కార్పొరేషన్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకులు యూనియన్ బ్యాంకులో విలీనమైన తర్వాత మొదటి బ్రాంచ్ ను సిద్ధిపేట జిల్లా హార్టికల్చర్ యూనివర్సిటీలో ప్రారంభిస్తున్నందుకు బ్యాంకు వర్గాలకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో 5వ స్థానంలో, తెలంగాణ రాష్ట్రంలో 2వ స్థానంతో యూనియన్ బ్యాంకు సేవలు అందిస్తుందని మంత్రికి బ్యాంకు అధికారు వివరించారు. కాగా, ఈ కార్యక్రమానికి ముందు ఉద్యానవన యూనివర్సిటీ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ లక్ష్మీ ప్రసాద్, ఇతర బ్యాంకు అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Also read:

Pay Gap: సినీ ఇండస్ట్రీలో ‘పే’ గ్యాప్ వివాదం.. సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న హీరోయిన్స్..

Ts High Court: తెలంగాణ డిగ్రీ పరీక్షలపై హైకోర్టులో పిటిషన్‌.. జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు

Viral Video: మెడలో పాముతో వృద్ధుడు సైకిల్‌పై సవారీ.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!