Errabelli Dayakar rao : యాదాద్రి లక్ష్మీనరసింహుని చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. కేసీఆర్‌ పాలనపై కీలక వ్యాఖ్యలు

|

Mar 20, 2021 | 8:33 PM

Errabelli Dayakar rao : యాదాద్రి నిర్మాణం చారిత్రాత్మ‌కంగా జ‌రుగుతున్న‌ద‌ని, ఈ నిర్మాణం చేప‌ట్టిన సీఎం కేసీఆర్, చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోయే..

Errabelli Dayakar rao : యాదాద్రి లక్ష్మీనరసింహుని చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు..  కేసీఆర్‌ పాలనపై కీలక వ్యాఖ్యలు
Follow us on

Errabelli Dayakar rao : యాదాద్రి నిర్మాణం చారిత్రాత్మ‌కంగా జ‌రుగుతున్న‌ద‌ని, ఈ నిర్మాణం చేప‌ట్టిన సీఎం కేసీఆర్, చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోయే విధంగా ప‌రిపాల‌న సాగిస్తున్నార‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. శాస‌నస‌భ‌లో ప్ర‌వేశపెట్టిన బ‌డ్జెట్ క‌రోనా క‌ష్ట కాలంలోనూ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల సంక్షేమం, అభివృద్ధికి అద్దంప‌ట్టేలా ఉంద‌ని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌ని, సీఎం కేసీఆర్, ఆయ‌న కుటుంబం చిరాయువుగా సుఖ సంతోషాల‌తో ఉండాల‌ని కోరుకున్నామ‌న్నారు.

అలాగే, రాష్ట్రంలో ఎన్నికేదైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్ దేన‌ని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని యాద‌గిరి గుట్ట శ్రీ యాదాద్రి ల‌క్ష్మీన‌ర్సింహ స్వామి వారిని మంత్రి ఎర్ర‌బెల్లి శ‌నివారం సాయంత్రం ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రికి ఆల‌య అధికారులు, అర్చ‌కులు ఆల‌య మ‌ర్యాద‌ల‌తో పూర్ణ కుంభ స్వాగ‌తం ప‌లికారు. స్వామి వారి ద‌ర్శ‌నం కల్పించారు. తీర్థ‌, ప్ర‌సాదాలు, ఆశీర్వ‌చ‌నం ఇచ్చి, స్వామి వారి పట్టువ‌స్త్రాల‌ను అంద‌చేశారు. మ‌రికొద్ది రోజుల్లోనే యాదాద్రి పున‌ర్నిర్మాణ ప‌నులు పూర్త‌వుతాయ‌ని ఎర్రబెల్లి చెప్పారు, సీఎం కేసీఆర్ గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా యాదాద్రిని అద్భుత పుణ్య‌క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నార‌న్నారు. ఈ ఆల‌య విశిష్ట‌త‌ను ఇనుమ‌డింప చేసేలా, ప‌నులు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయ‌న్నారు.

మ‌రోవైపు, తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు అద్భుతంగా సాగుతున్నాయ‌ని, బ‌డ్జెట్ లో క‌రోనా క‌ష్టాల‌ను అధిగ‌మించి, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు న్యాయం చేశార‌న్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ టీఆర్ఎస్ విజ‌యం సాధించింద‌ని, వ‌చ్చే నాగార్జున సాగ‌ర్ ఎన్నిక‌ల్లోనూ విజ‌య ప‌తాకాని ఎగుర‌వేస్తామ‌న్నారు. యాదాద్రి ల‌క్ష్మీన‌ర్సింహ‌స్వామి త‌మ ఇల‌వేల్పు అని, అందుకే తాను త‌ర‌చూ దేవాల‌యాన్ని సంద‌ర్శిస్తామ‌న్నారు. సీఎం కేసీఆర్, ఆయ‌న కుటుంబం చ‌ల్ల‌గా ఉండాల‌ని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌ని ఆకాంక్షించిన‌ట్లు మంత్రి వివ‌రించారు.

Read also : TRS MLC Surabhi Vanidevi : పట్టభద్రుల ఎమ్మెల్సీగా జయకేతనం, ఇంతకీ.. ఎవరీ సురభి వాణీదేవి.? ఆమె ప్రస్థానమేంటి?, ఆమె పయనమెలా..?