
ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం కొట్టుకున్న మహిళలు, పురుషులు.. ఈ ఘటన వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా పరిగి నుంచి వయా నస్కాల్ మీదుగా వికారాబాద్ వెళ్లే ఆర్టీసి
బస్సులో సీట్ల కోసం పురుషులు, మహిళలు కొట్టుకున్నారు… పరిగి నుంచి వికారాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు ఎక్కువ ఉండడంతో దొరికిన ఒక్క సీటు కోసం ఒకరినొకరు కొట్టుకున్నారు. పరిగి నుంచి వికారాబాద్ వెళ్ళేందుకు బస్సులు తక్కువగా ఉన్నందున జనాలు గుంపులు గుంపులుగా బస్సులలో ఎక్కడంతో… సీట్లులేక ఇలాంటి సంఘటనలు నిత్యం ఏదో ఓ చోట జరుగుతూనే ఉన్నాయని తోటి ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ రూట్లో ఇరు ఆర్టీసీ డిపోల అధికారులు స్పందించి బస్సుల సంఖ్య పెంచి… ఇలాంటి ఘటనలు పునవృతం కాకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..