Death Penalty: సంచలన తీర్పు ఇచ్చిన మహబూబాబాద్‌ కోర్టు.. బాలుడి కిడ్నాప్‌, మర్డర్‌ కేసులో దోషికి మరణ శిక్ష విధించిన జడ్జి..

|

Sep 29, 2023 | 10:50 PM

దోషి.. మంద సాగర్‌కు కోర్టు మరణ శిక్ష విధించడంతో బాధిత కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. బాలుడు దీక్షిత్ రెడ్డి హత్య కేసులో మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో డబ్బు కోసం దీక్షిత్ అనే బాలుడిని కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా హతమార్చిన కేసులో దోషి మంద సాగర్ కి మరణ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మహబూబాబాద్‌కు చెందిన జర్నలిస్టు రంజిత్ రెడ్డి, వసంతల కుమారుడైన తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్‌ని మంద సాగర్‌ కిడ్నాప్ చేశాడు.

Death Penalty: సంచలన తీర్పు ఇచ్చిన మహబూబాబాద్‌ కోర్టు.. బాలుడి కిడ్నాప్‌, మర్డర్‌ కేసులో దోషికి మరణ శిక్ష విధించిన జడ్జి..
Death Penalty
Follow us on

మహబూబాబాద్‌, సెప్టెంబర్ 29: మైనర్‌ బాలుడి మర్డర్‌ కేసులో మహబూబాబాద్‌ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దోషి.. మంద సాగర్‌కు కోర్టు మరణ శిక్ష విధించడంతో బాధిత కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. బాలుడు దీక్షిత్ రెడ్డి హత్య కేసులో మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో డబ్బు కోసం దీక్షిత్ అనే బాలుడిని కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా హతమార్చిన కేసులో దోషి మంద సాగర్ కి మరణ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

మహబూబాబాద్‌కు చెందిన జర్నలిస్టు రంజిత్ రెడ్డి, వసంతల కుమారుడైన తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్‌ని మంద సాగర్‌ కిడ్నాప్ చేశాడు. ఆపై కేసముద్రం మండలం అన్నారం శివారులోని దానమయ్య గుట్టపైకి తీసుకువెళ్లి పిల్లాడిపై పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశాడు. ఆ దారుణ హత్య అనంతరం తల్లిదండ్రులకు ఫోన్ చేసి 45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు మంద సాగర్‌. ఈ కేసు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

పోలీసులకు దొరక్కుండా ఇంటర్నెట్ కాల్స్ ద్వారా తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు సాగర్‌. కిడ్నాప్ అయిన బాలుడిని ప్రాణాలతో కాపాడాలని పోలీసులు చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. బాలుడిని కిడ్నాపర్ అత్యంత దారుణంగా హతమార్చాడు. చిన్నపిల్లాడిని హతమార్చిన మంద సాగర్ ఒక సైకిల్ పంక్చర్‌ షాప్‌ నడుపుకునేవాడు. అప్పట్లో ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టి మంద సాగర్ ను అరెస్ట్ చేశారు.

మూడేళ్ళ పాటు ఈ కేసుపై కోర్టులో విచారణ జరిగింది. తాజాగా కోర్టు ఈ కేసులో సంచలన తీర్పు ఇచ్చింది. మహబూబాబాద్ జిల్లా జడ్జి ఇచ్చిన తీర్పుపై బాధిత కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. న్యాయ దేవత, పోలీసుల చిత్ర పటాలకు పాలాభిషేకం చేసిన దీక్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులు జడ్జి తీర్పుతో న్యాయం ఇంకా బ్రతికే ఉందని అన్నారు. తమ కుమారుడి ఆత్మకు ఇంతకాలానికి శాంతి కలిగిందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి