Adulterated: ఈ కల్తీ దందా ఆగేదెలా..? పెయింట్లలో వాడే కెమికల్స్ అల్లం వెల్లుల్లి పేస్టులో..

Adulterated: ఈ కల్తీ దందా ఆగేదెలా..? పెయింట్లలో వాడే కెమికల్స్ అల్లం వెల్లుల్లి పేస్టులో..

Anil kumar poka

|

Updated on: Sep 29, 2023 | 11:34 PM

పరిగెడుతున్న కాలంలో మనమంతా ఇన్స్టంట్ ఫుడ్ కి అలవాటు పడ్డం.ఏదైనా అనుకున్న వెంటనే రెడీమేడ్ గా ఉందంటే సొంతంగా తయారు చేసుకునే దానికన్నా దానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం. ఈ కల్తీ ల వల్ల ఎక్కువగా నష్టం కలుగుతుంది ఫుడ్ ప్రొడక్ట్స్ లోనే. వంటల్లో టేస్ట్ కోసం వాడే ఆహార పదార్థాల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ ప్లేసులో ఉంటుంది. కాబట్టి ప్రతిచోట అల్లం వెల్లుల్లి తయారీ కర్మాగారాలు వెలిసాయి.

పరిగెడుతున్న కాలంలో మనమంతా ఇన్స్టంట్ ఫుడ్ కి అలవాటు పడ్డం.ఏదైనా అనుకున్న వెంటనే రెడీమేడ్ గా ఉందంటే సొంతంగా తయారు చేసుకునే దానికన్నా దానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం. ఈ కల్తీ ల వల్ల ఎక్కువగా నష్టం కలుగుతుంది ఫుడ్ ప్రొడక్ట్స్ లోనే. వంటల్లో టేస్ట్ కోసం వాడే ఆహార పదార్థాల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ ప్లేసులో ఉంటుంది. కాబట్టి ప్రతిచోట అల్లం వెల్లుల్లి తయారీ కర్మాగారాలు వెలిసాయి. హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చిన్నచిన్న ఫుడ్ స్టాల్స్ లో ఇన్స్టంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వాడుతారు. ఇలా ఇన్స్టంట్ గా కొనుగోలు చేస్తేనే ఖర్చు తక్కువగా ఉండటమే ప్రధాన కారణం. ట్రాన్స్‌పోర్ట్‌ చేసి, లాభాలు చూసుకుని అమ్మే ప్రోడక్ట్ ని కూడా అంత తక్కువ రేటుకు ఇస్తున్నారంటే అందులో కచ్చితంగా నాణ్యత లోపాలు ఉంటాయని వినియోగదారులు గ్రహించాలి. నేతి బీరకాయలో నెయ్యి ఉండదనేది ఎంత వాస్తవామో మార్కెట్లో దొరికే అల్లం వెల్లుల్లి పేస్టులో అల్లం ఉండదనేది కూడా అంతే వాస్తవం. అల్లం వెల్లుల్లి లేకుండానే పేస్టు తయారు చేస్తున్నారు.

కుళ్లిపోయిన వెల్లుల్లి తోపాటు, వెల్లుల్లి పొట్టును కలిపి అందులో పలు రకాల ప్రమాదకరమైన రసాయనాలను రంగు కోసం ,రుచి కోసం, మంచి సువాసన వచ్చేందుకు, ఎక్కువ కాలం పాడవకుండా ఉండేందుకు కలుపుతున్నారు. టైటానియం డయాక్సైడ్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలను వెల్లుల్లి పేస్టు లో వాడుతున్నారు. టైటానియం డయాక్సైడ్ రబ్బర్, టెక్స్టైల్స్, పెయింట్స్, ఇంక్, పేపర్, సిరామిక్ తయారీలో వాడే కెమికల్ . అల్లం వెల్లుల్లి పేస్ట్ లో దీన్ని వాడటం వల్ల కుళ్ళిన వాసన రాకుండా ఎక్కువకాలం నిలువ ఉంటుంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఇలాంటి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు వాడుతారు కాబట్టి రోడ్ల మీద ఉండే చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కి దూరంగా ఉండటం మంచిదని వైద్యులు చెబుతున్నారు ఉప్పల్ పిఎస్ పరిధిలోని ఓల్డ్ రామంతపూర్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు దాడి చేసారు. టైటానియం, సిట్రిక్ యాసిడ్, ఇతర రసాయనాలతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న వ్యాపారి మహమ్మద్ అబ్దుల్ని అరెస్టు చేశారు. నిందితుడిపై ఉప్పల్ పిఎస్ లో కేసు నమోదు చేసారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Sep 29, 2023 10:33 PM