Iskcon: ఇస్కాన్ గోశాలల్లో ఆవుల్ని కబేళాలకు అమ్మేస్తున్నారన్న మాజీ కేంద్ర మంత్రి మేనక గాంధీ.
ఇస్కాన్ పై మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ మేనకా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఇస్కాన్ సభ్యులు మోసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గోశాలల నిర్వాహణ పేరుతో వారు ఆవుల్ని కసాయివాళ్లకు అమ్ముకుంటున్నారని మేనకా గాంధీ ఆరోపించారు.ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న ఇస్కాన్, తమ గోశాలల్లో ఉన్న ఆవుల్ని అమ్ముకుంటున్నట్లు మేనకా గాంధీ చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇస్కాన్ పై మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ మేనకా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఇస్కాన్ సభ్యులు మోసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గోశాలల నిర్వాహణ పేరుతో వారు ఆవుల్ని కసాయివాళ్లకు అమ్ముకుంటున్నారని మేనకా గాంధీ ఆరోపించారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న ఇస్కాన్, తమ గోశాలల్లో ఉన్న ఆవుల్ని అమ్ముకుంటున్నట్లు మేనకా గాంధీ చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.” అందులో ఆమె ఇటీవలే అనంతపురంలో ఉన్న గోశాలను సందర్శించినట్లు చెప్పారు. అక్కడ వట్టిపోయిన ఆవు ఒక్కటి కూడా కనిపించలేదని, దూడలు కూడా లేవని అన్నారు. గోశాలలో కనీసం ఒక్క ఆవు కూడా లేదంటే అక్కడి గోవుల్ని అమ్ముకుంటున్నట్లే కదా అని మేనకా గాంధీ ఆరోపించారు.
ఆవుల్ని అమ్ముకుంటున్న ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ అని భజన చేస్తోందని అన్నారు. పాల మీదే ఆధారపడి బతుకుతున్నామని చెప్పుకునే ఇస్కాన్ సభ్యులు అమ్మినంతగా మరెవరూ ఆవుల్ని కసాయి వాళ్లకు అమ్మరని ఆమె మండిపడ్డారు. మేనకా గాంధీ చేసిన ఆరోపణలను ఇస్కాన్ తీవ్రంగా ఖండించింది. పశు సంరక్షణలో ఇస్కాన్ ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పింది. ఈ మేరకు ఇస్కాన్ ప్రతినిధి యుధిష్టిర్ గోవిందా దాస్ ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. భారత్ లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా తాము గోవుల్ని సంరక్షిస్తున్నట్లు అందులో రాశారు. గోవులకు జీవితాలను ప్రసాదిస్తున్నామని, వాటిని కసాయిలకు అమ్మడం లేదని ఇస్కాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు అనంతపురంలో గోశాలలో ఉన్న ఒట్టి పోయిన ఆవుల వీడియోలతో పాటు… ఆ గోశాలను తరచు సందర్శించే స్థానిక ప్రభుత్వ పశు వైద్యుడు అలాంటిదేమీ జరగడం లేదని, ఒట్టి పోయిన ఆవుల్ని అక్కడ కన్న బిడ్డల్లా సంరక్షిస్తున్నారంటూ ధ్రువీకరిస్తూ ఇచ్చిన ఓ లేఖను కూడా ట్వీట్టర్లో పోస్ట్ చేశారు యుధిష్టర్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

