Telangana Lockdown: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. లాక్‌డౌన్‌ పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..

Telangana Lockdown: ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. లాక్‌డౌన్‌కు ముందు భారీగా నమోదైన పాజిటివ్‌ కేసులు.. లాక్‌డౌన్‌ విధించిన తర్వాత..

Telangana Lockdown: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. లాక్‌డౌన్‌ పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..
Follow us
Subhash Goud

|

Updated on: May 18, 2021 | 9:54 PM

Telangana Lockdown: ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. లాక్‌డౌన్‌కు ముందు భారీగా నమోదైన పాజిటివ్‌ కేసులు.. లాక్‌డౌన్‌ విధించిన తర్వాత అనూహ్యంగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాక్‌డౌన్‌పై మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న లాక్ డౌన్ ను ఈనెల 30 తేదీ వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మంత్రులందరితో మంగళవారం ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కేబినెట్‌ మంత్రులందరి అభిప్రాయాలను సేకరించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్‌ను మే 30 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో, వైద్య సేవల పర్యవేక్షణలో భాగంగా మంత్రులు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బిజీగా ఉన్నందున ఈ నెల 20న నిర్వహించే మంత్రివర్గ సమావేశాన్ని సీఎం రద్దు చేశారు.

అయితే రాష్ట్రంలో భారీగా నమోదైన కేసులు.. లాక్‌డౌన్‌ తర్వాత అనూహ్యంగా తగ్గుముఖం పట్టడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాక్‌డౌన్‌ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విధిస్తున్న లాక్‌డౌన్‌ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మినహాంపు ఇస్తూ, 10 నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలవుతోంది. ఈ సెకండ్‌వేవ్‌లో కరోనా కట్టడికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. మాస్క్‌లు ధరించనివారిపై, అలాగే లాక్‌డౌన్‌ సమయంలో బయటకు వచ్చిన వారిపై కొరఢా ఝులిపిస్తున్నారు పోలీసులు. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

కాగా, తెలంగాణలో ప్రస్తుతం పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కరోనా సెకండ్‌వేవ్‌లో పది వేల వరకు నమోదైన కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3982 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 27 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 5,36,766కి చేరింది. ఒక్క రోజే 5186 మంది వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచిడిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4,85,644కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 3012 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 48,110 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇవీ చదవండి:

Vijayashanthi: ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ విస్మరించారు.. ఆరోగ్య శ్రీలో కరోనాను చేర్చాలన్న విజయశాంతి

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా టీకా యజ్ఞం.. తెలుగు రాష్ట్రాల్లో నిలిచిన వ్యాక్సినేషన్.. ఇప్పటివరకు ఎంతమందికి అందిందంటే!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే