KTR: బ్లాక్ అయిన కేటీఆర్‌ వాట్సాప్‌ అకౌంట్‌.. అసలు కారణమేంటో చెప్పిన యాజమాన్యం..

KTR: సోషల్‌ మీడియాలో (Social Media) యాక్టివ్‌గా ఉండే రాజకీయ నాయకుల్లో తెలంగాణ ఐటీశాఖమంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ (TRS Working president) కేటీఆర్‌ మొదటి వరుసలో ఉంటారు. ట్విట్టర్‌ (Twitter), వాట్సాప్‌ ఇలా అన్ని...

KTR: బ్లాక్ అయిన కేటీఆర్‌ వాట్సాప్‌ అకౌంట్‌.. అసలు కారణమేంటో చెప్పిన యాజమాన్యం..

Edited By: Ravi Kiran

Updated on: Jul 27, 2022 | 11:40 AM

KTR: సోషల్‌ మీడియాలో (Social Media) యాక్టివ్‌గా ఉండే రాజకీయ నాయకుల్లో తెలంగాణ ఐటీశాఖమంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ (TRS Working president) కేటీఆర్‌ మొదటి వరుసలో ఉంటారు. ట్విట్టర్‌ (Twitter), వాట్సాప్‌ ఇలా అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా నిత్యం ప్రజలతో టచ్‌లో ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా కేటీఆర్‌ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. వాట్సాప్‌ బ్లాక్‌ అయినట్లు తెలిపే మెసేజ్‌ స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేశారు కేటీఆర్‌.

ఎడమ కాలి వేలికి గాయం కావడంతో కేటీఆర్‌ ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. వైద్యుల సూచనల మేరకు తాను రెస్ట్‌ తీసుకున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే వాట్సాప్‌ బ్లాక్‌కు సంబంధించి ట్వీట్‌ చేస్తూ.. ‘నా వాట్సాప్‌ బ్లాక్‌ అయ్యింది. నిన్నటి నుంచి నాకు 8 వేలకుపైగా మెసేజ్‌లు వచ్చాయి. వచ్చిన అన్ని మెసేజ్‌లకు స్పందించాలని ప్రయత్నించాను. నాకు 24 గంటల నుంచి వాట్సాప్‌ సేవలు పనిచేయడం లేదు’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో పాటు చివర్లో ‘డిజిటల్‌ ఛాలెంజెస్‌’ అనే హష్‌ట్యాగ్‌ను జోడించారు కేటీఆర్‌.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే కేటీఆర్‌ అకౌంట్‌ బ్లాక్‌ అవ్వడానికి గల కారణాన్ని వాట్సాప్‌ తెలియజేస్తూ.. ‘స్పామ్‌ కారణంగా ఈ వాట్సాప్‌ అకౌంట్ పనిచేయడం లేదు’ అనే అలర్ట్‌ ఇచ్చింది. దీన్నిబట్టి లెక్కకుమించి వచ్చిన మెసేజ్‌ల కారణంగానే అకౌంట్‌ బ్లాక్‌ అయినట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..