మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు పుట్టినరోజు వేడుకను వినూత్నంగా జరుపుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన బాబాయి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి హిమాన్షు.. ప్రగతి భవన్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హిమాన్షు మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్, హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు అందరు పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని సూచించారు.
అనంతరం ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. హిమాన్షుకు ఈ జన్మదినం ప్రత్యేకమైనది అని తెలిపారు. హిమాన్షు దత్తత తీసుకున్న రెండు గ్రామాల్లో కల్తీ లేని ఆహారం కోసం గొప్ప కార్యక్రమం చేపట్టి.. విజయవంతంగా అమలు చేసినందుకు.. డయానా అవార్డు వరించిందని పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో హిమాన్షు పాల్గొని మొక్కలు నాటడం సంతోషకరమైనది. భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీస్సులు అందిస్తున్నాని సంతోష్ కుమార్ తెలిపారు.
On the occasion of my birthday, I’ve planted 2 saplings along with @MPsantoshtrs Babayi to endorse Haritha Haram and #greenindiachallenge!
It’s a pleasure to be part of these initiatives! pic.twitter.com/wmScGB7aWU— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) July 12, 2021
ఇక తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు 2021 ఏడాదికిగానూ ఓ అంతర్జాతీయ పురస్కారం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. డయానా అంతర్జాతీయ అవార్డుకు KTR తనయుడు హిమాన్షు రావును ఎంపిక చేశారు. బ్రిటన్‌లోని తెస్సి ఒజో సీబీఈ ఆధ్వర్యంలోని సంస్థ దివంగత వేల్స్ రాకుమారి డయానా పేరిట ఓ ఇవార్డును అందిస్తోంది. సామాజిక సేవలు అందించే 9 నుంచి 25 ఏళ్ల లోపు వారికి ఈ అవార్డును అందజేస్తారు. ఈ క్రమంలో హిమాన్షు రావు(15)ను ఈ ఏడాది డయానా అవార్డు వరించింది.