KTR: ఓవైపు బీజేపీ విమోచన దినోత్సవం, మరో వైపు టీఆర్‌ఎస్ జాతీయ సమైక్య దినోత్సవం వెరసి సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ వేదికగా రాజకీయాలు హీటెక్కాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ విమోచన దినోత్సవం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమిత్ షా చేసిన ప్రసంగంపై మంత్రి కేటీఆర్ పరోక్షంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా అమిత్ షా పేరును ప్రస్తావించకుండానే కౌంటర్ అటాక్ ఇచ్చారు కేటీఆర్.
ఈ విషయమై కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. ’74 ఏళ్ల కిత్రం ఓ కేంద్ర హోం మంత్రి హైదరాబాద్‌కు వచ్చి తెలంగాణ ప్రజలను భారత యూనియన్‌లో విలీనం చేసి సమైక్యతను చాటారు. ఈరోజు ఓ కేంద్ర మంత్రి తెలంగాణ ప్రజలను, రాష్ట్ర ప్రభుత్వాన్ని విభజించి బెదిరించేందుకు వచ్చారు. అందుకే నేను చెప్పేది, దేశానికి కావాల్సింది విభజన రాజకీయాలు కాదు, నిర్ణయాత్మక విధానాలు కావాలి’ అని కేటీఆర్ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే అంతకు ముందు సిరిసిల్ల జిల్లా కలక్టరేట్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
74 years ago, A Union Home Minister came to UNITE & INTEGRATE The People of
Telangana into Indian unionToday A Union Home Minister has come to DIVIDE & BULLY
The People of Telangana & their state GovtThat’s why I say, India needs
DECISIVE POLICIES Not
DIVISIVE POLITICS— KTR (@KTRTRS) September 17, 2022
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో మంత్రి @KTRTRS జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.#HyderabadIntegrationDay pic.twitter.com/wRMpbLXHM6
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 17, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..