Narayana College: మాదాపూర్ నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

|

Aug 11, 2023 | 7:20 PM

మాదాపూర్‌ నారాయణ కాలేజీలో అకనక రాజు అనే విద్యార్థి ఇంటర్‌ బైపీసీ సెకండియర్‌ చదువుతున్నాడు. మధ్యాహ్నం భోజనం తర్వాత క్లాస్‌ నిర్వహిస్తున్న సమయంలో కనకరాజు కనిపించలేదు. అటెండెన్స్‌ తీసుకుంటున్న తరగతి ఉపాధ్యాయుడు కనకరాజు లేకపోవడంతో అతని గదికి వెళ్లి చూడమని సిబ్బందికి సూచించాడు. గది వద్దకు చేరుకున్న సిబ్బంది గదిలో ఫ్యాన్‌కు విగతజీవిగా వేలాడుతూ కనకరాజు కనిపించాడు. దీంతో యాజమన్యం పోలీసులకు సమాచారం అందించారు..

Narayana College: మాదాపూర్ నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Student Suicide
Follow us on

హైదరాబాద్‌, ఆగస్టు 11: చదువుల ఒత్తిడి మరో విద్యార్థి జీవితాన్ని చిత్తు చేసింది. మాదాపూర్ నారాయణ కాలేజీలో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతోన్న విద్యార్థి శుక్రవారం (ఆగస్టు 11) తన గదిలో ఫ్యాన్‌కు ఉరి పెట్టుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే..

మాదాపూర్‌ నారాయణ కాలేజీలో అకనక రాజు అనే విద్యార్థి ఇంటర్‌ బైపీసీ సెకండియర్‌ చదువుతున్నాడు. మధ్యాహ్నం భోజనం తర్వాత క్లాస్‌ నిర్వహిస్తున్న సమయంలో కనకరాజు కనిపించలేదు. అటెండెన్స్‌ తీసుకుంటున్న తరగతి ఉపాధ్యాయుడు కనకరాజు లేకపోవడంతో అతని గదికి వెళ్లి చూడమని సిబ్బందికి సూచించాడు. గది వద్దకు చేరుకున్న సిబ్బంది గదిలో ఫ్యాన్‌కు విగతజీవిగా వేలాడుతూ కనకరాజు కనిపించాడు. దీంతో యాజమన్యం పోలీసులకు సమాచారం అందించారు.

అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు కనకరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విద్యార్ధి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదువులో బాగా రాణించేవాడని, ఫస్ట్‌ ఇయర్‌లో కూడా మంచి మార్కులు వచ్చాయని కాలేజీ యాజమాన్యం పోలీసులకు తెల్పింది. తల్లిదండ్రులకు సమాచారం అందించామని, వాళ్లను ప్రశ్నిస్తే కనరాజుకి ఉన్న సమస్యేంటో బయటపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. కాగా రాజేంద్రనగర్‌లో ఓ కార్పొరేట్‌ కాలేజీలో ఇటీవల ఓ ఉద్యోగి మృతి చెందిన ఉదంతం మరువకముందే మరో ఘటన చోటుచేసుకోవడంతో ఈ విషయం స్థానికంగా చర్చణీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

రాజస్థాన్‌లోని కోటాలో ఆగని విద్యార్ధుల వరుస ఆత్మహత్యలు

రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. తాజాగా ఐఐటీ జేఈఈకి కోచింగ్ తీసుకుంటున్న మనీశ్‌ ప్రజాపతి అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధుల సంఖ్య 19 మందికి చేరింది. ఆగస్టు నెలలోనే ఇది మూడో ఘటన కావడం విశేషం.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆజంగఢ్‌కు చెందిన మనీశ్‌ ప్రజాపతి (17) ఇంజనీరింగ్ ప్రవేశపరీక్షకు కోచింగ్‌ తీసుకోవడానికి 4 నెలల క్రితం కోటాలోని కోచింగ్‌ సెంటర్‌లో చేరాడు. గురువారం మనీశ్‌ను కలిసేందుకు అతడి తండ్రి వచ్చి.. అదే రోజు సాయంత్రం మనీశ్‌ను హాస్టల్ వద్ద వదిలిపెట్టి అతను తిరిగివెళ్లిపోయాడు. ఊరి చేరుకోకముందే రాత్రి 8 గంటల సమయంలో కుమారుడు మనీశ్‌కు ఫోన్‌ చేయగా సమాధానం రాలేదు. దీంతో హాస్టల్ వార్డెన్‌కు ఫోన్‌ చేసి చేయగా.. వార్డెన్‌ వెంటనే హాస్టల్‌ గది వద్దకు వెళ్లాడు. మనీశ్‌ ఎంతకూ తలుపు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూసిన వార్డెన్‌కు ఫ్యాన్‌కు వేలాడుతూ మనీశ్‌ కనిపించాడు. బెడ్‌షీట్‌తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కుమారుడిని కలిసిన కొద్దిగంటల్లోనే మరణవార్త వినడంతో తండ్రి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. కాగా మనీష్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

పలు ఎంట్రెన్స్‌ టెస్టులు, పోటీపరీక్షల కోచింగ్‌ సెంటర్లకు ‘కోటా’ అడ్డగా ఉంది. వివిధ రాష్ట్రాల ఎంతో మంది విద్యార్థులు ఇక్కడకు వచ్చి కోచింగ్‌ తీసుకుంటుంటారు. ఈ ఏడాది దాదాపు 2.5 లక్షల మంది విద్యార్ధులు అక్కడ పలు కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అక్కడ విద్యార్థులు వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.