Telangana: వారి అనుబంధానికి తీపిగుర్తుగా భార్య సమాధిపై విగ్రహాలు.. బతికుండగానే భార్య విగ్రహం పక్క భర్త విగ్రహం..

అనుబంధాలు పతమనమవుతున్న ఈ రోజుల్లో ఓ భర్త మృతిచెందిన తన భార్యకు విగ్రహం కట్టించాడు. ఆమెకు గుడిలాంటి అందమైన సమాధిని నిర్మించి అందులో విగ్రహం ఏర్పాటు చేశాడు. భార్యలేని ఎడబాటును జీర్ణించుకోలేక భార్య విగ్రహం పక్కనే బతికుండానే తన విగ్రహాన్ని పెట్టించుకున్నాడు. వీరి ఇద్దరి విగ్రహాలు చూడగానే మనసులో వారి అన్యోన్య దాంపత్యం, మాధుర్యం తెలిపిసిపోతుంది. కమ్మర్ పల్లి మండలం నర్సాపూర్‌లో..

Telangana: వారి అనుబంధానికి తీపిగుర్తుగా భార్య సమాధిపై విగ్రహాలు.. బతికుండగానే భార్య విగ్రహం పక్క భర్త విగ్రహం..
Idols On Wife Grave

Edited By: Srilakshmi C

Updated on: Jan 25, 2024 | 1:38 PM

నర్సాపూర్, జనవరి 25: అనుబంధాలు పతమనమవుతున్న ఈ రోజుల్లో ఓ భర్త మృతిచెందిన తన భార్యకు విగ్రహం కట్టించాడు. ఆమెకు గుడిలాంటి అందమైన సమాధిని నిర్మించి అందులో విగ్రహం ఏర్పాటు చేశాడు. భార్యలేని ఎడబాటును జీర్ణించుకోలేక భార్య విగ్రహం పక్కనే బతికుండానే తన విగ్రహాన్ని పెట్టించుకున్నాడు. వీరి ఇద్దరి విగ్రహాలు చూడగానే మనసులో వారి అన్యోన్య దాంపత్యం, మాధుర్యం తెలిపిసిపోతుంది. కమ్మర్ పల్లి మండలం నర్సాపూర్‌లో ఇనాయత్ నగర్ వెళ్లే దారిలో రోడ్డు సమీపంలో సమాదిపై తన భార్య దివంగత పడాల చంద్రబాగు విగ్రహం పక్కనే బతికున్న తన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పడాల గంగాధర్.

విగ్రహం తోనే మాట‌లు- చూట్టు ప‌చ్చని చేట్లు

పడాల గంగాధర్ చంద్రబాగు దంపతులది కమ్మర్ పల్లి మండలం నర్సాపూర్ ఈ దంపతులు అన్యోన్యంగా జీవించే వారు. వారి వైవాహిక జీవితంలో ఇరువురు ఒకరినొకరు పల్లెత్తు మాట కూడా అనుకోని పరస్పరారాథ్య ఆలుమగల బందం వారిది. ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు. వీరి అన్యోన్య దాంపత్యాన్ని చూసి గ్రామస్తులు, బంధువులు ఆశ్చర్యపోయేవారు. భర్త గంగాధర్ కిరాణ కొట్టునడుపుతూ.. భార్య చంద్రబాగు బీడీలు చుడుతూ.. జీవనం సాగించేవారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి దాంపత్య బంధాన్ని విది వెక్కిరించింది. 2007 ఏప్రిల్ లో ఓ రోజు తన ఇంటి దాబాపై పడుకున్న చంద్రబాగు ప్రమాద వశాత్తు దాబాపై నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడింది. వారం రోజుల తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. భార్య మృతిని గంగాధర్ తట్టులేకపోయాడు. ఇప్పటికీ తన దాంపత్య బందాన్ని ఎవరు గుర్తు చేసినా ఎంతో మురిపెంగా తన భార్య జ్ఞాపకాలను వివరిస్తాడు గంగాధర్. భార్య విగ్రహంపై దుమ్ము పడ్డా తట్టుకోలేడు. అప్పుడు డప్పుడు వెళ్లు తన రుమాలుతో తుడిచి అదే రుమాలుతో తన కన్నీరు తుడుచుకొని వస్తాడు. విగ్రహాలు ఉన్న సమాధి వద్ద గల కొంతపాటి ఖాళీ జాగాలో షడ్డు వేయించి పచ్చని చెట్లతో నింపాడు.

గుడిలా మారిన స‌మాధి

భార్యను మరిచిపోలేక ఆమెపై ప్రేమతో గ్రామ సమీపంలోని తన వ్యవసాయ తోటలో భార్య సమాధిని చిన్నగుడిలా నిర్మించుకున్నాడు. అందులో తన భార్య చంద్రబాగు విగ్రహాన్ని ప్రతిష్టించాడు. కానీ తన భార్యతో సహ జీవన స్మృతులను పెళ్లినాటి ప్రమాణాలను గుర్తుచేసుకుంటూ బాధ నుంచి బయటపడలేకపోయాడు. తన భార్య లేకుండా ఒంటరిగా ఊహించలేకపోతున్నానని తన భార్య కూడా తనను ఒంటరిగా విడిచి ఏనాడు ఉండలేదని కొడులకులతో చెప్పుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యేవాడు గంగాధర్. ఇలా కుమిలిపోతు ఓ నిర్ణయానికి వచ్చాడు. సమాధిలోని తన భార్య విగ్రహం వద్ద తన విగ్రహం కూడా పెట్టించుకుంటానని ఓ రోజు కొడుకులతో చెప్పాడు. ఆ మాటలు విని కొడుకులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అమ్మదూరమైన బాధలో ఉన్న కొడుకులకు తండ్రి నిర్ణయం నిర్ఘాంతపోయేలా చేసింది. బతికుండగానే సమాధిలో విగ్రహం పెట్టుకుంటే తాము తట్టుకోలేము నాన్న అంటూ తండ్రి నిర్ణయాన్ని మార్చేందుకు ఆ కొడుకులు విఫలయత్నం చేశారు. కానీ నాన్నకు అమ్మపై ఉన్న ప్రేమ తండ్రి నిర్ణయాన్ని అంగీకరించేలా చేసింది. దీంతో తన భార్య విగ్రహం పక్కనే తన విగ్రహం పెట్టించుకున్నాడు. ఇలా తన ఆలుమగల అనురాగాన్ని తమ విగ్రహాల రూపంలో తాను బతికుండగానే శాశ్వతంగా ఆవిష్కరించుకున్నాడు. అర్థాంగికి సరైన నిర్వచనం చెప్పిన భర్తగా నిలిచాడు గంగాధర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.