Khammam: మరణంలోనూ వీడని బంధం.. భార్య పార్థివ దేహం వద్దే ప్రాణాలు వొదిలేసిన భర్త..

| Edited By: Basha Shek

Aug 20, 2023 | 9:31 AM

భార్య రాయల మార్తమ్మ (96) గుండెపోటు తో మరణించింది.. భార్య మరణాన్ని తట్టుకోలేక .. కొద్ది నిమిషాల్లోనే భర్త రాయల యేహాన్ ( 112) కుప్పకూలి మృతి చెందాడు. నీ తోడే నేను.. నీ వెంటే నేను.. కష్టాల్లో అయినా.. సుఖాల్లో అయినా.. నీ తోనే అంటూ.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని.. 70 ఏళ్ల వైవాహిక జీవితాన్ని గడిపిన ఇద్దరు వృద్ధ దంపతులు గుండెలు ఆగిపోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చండ్రుపట్ల

Khammam: మరణంలోనూ వీడని బంధం.. భార్య పార్థివ దేహం వద్దే ప్రాణాలు వొదిలేసిన భర్త..
Royala Yehanu, Marthamma
Follow us on

ఖమ్మం, ఆగస్టు 20: ఏడు అడుగులు నడిచారు. భార్య భర్తలుగా 70 ఏళ్ళు కలిసి జీవించారు. మనవల్లను, ముని మనవల్లను చూసారు. మూడు తరాల జగమంత కుటుంబం ఏర్పడింది. ఒకేరోజు కొద్ది నిమిషాల వ్యవధిలోనే వృద్ద దంపతులు మృతి చెందారు. నీ వెంటే నేను అంటూ మరణం లోనూ వారి బంధం వీడలేదు.. కల్లూరు మండలం చంద్రుపట్ల గ్రామం లో ఈ విషాదం చోటు చేసుకుంది..భార్య రాయల మార్తమ్మ (96) గుండెపోటు తో మరణించింది.. భార్య మరణాన్ని తట్టుకోలేక .. కొద్ది నిమిషాల్లోనే భర్త రాయల యేహాన్ ( 112) కుప్పకూలి మృతి చెందాడు. నీ తోడే నేను.. నీ వెంటే నేను.. కష్టాల్లో అయినా.. సుఖాల్లో అయినా.. నీ తోనే అంటూ.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని.. 70 ఏళ్ల వైవాహిక జీవితాన్ని గడిపిన ఇద్దరు వృద్ధ దంపతులు గుండెలు ఆగిపోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చండ్రుపట్ల గ్రామానికి చెందిన రాయల యోహాను (112), రాయల మార్తమ్మ (96) అనే ఇద్దరు 70 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వారి వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉండే వారు. వారి నుంచి 50 మంది వంశం వారసులుగా కుటుంబసభ్యులు ఉన్నారు. గత కొద్ది రోజులుగా రాయల యోహాను కు 112 ఏళ్ళు వయసు కావడంతో వయసు రీత్యా ఆరోగ్యం క్షీణిస్తూ మంచానికి పరిమిత మయ్యాడు.

ఇక భార్య మార్తామ్మ అనారోగ్యానికి గురి కావడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అయితే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రిలోనే మర్తమ్మా మృతి చెందింది… వృద్ధురాలి పార్థివదేహాన్ని ఇంటికి తీసుకు రావడంతో అనారోగ్యంతో బాధ పడుతున్న రాయల యోహాను తన భార్య మర్తమ్మ పార్థివ దేహాన్ని చూసి తట్టుకోలేక పోయాడు. తన భార్యతో పాటు తాను ప్రాణాన్ని వదిలాడు. వీరి మరణంతో కుటుంబ సభ్యుల్లో,గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..