TS High Court Typist Jobs: తెలంగాణ జిల్లా కోర్టుల్లో 144 టైపిస్ట్‌ పోస్టులకు దరఖాస్తు చేశారా? మరికొన్ని గంటల్లో ముగుస్తోన్న గడువు

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన 144 టైపిస్ట్‌ పోస్టుల భర్తీకి రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. డిగ్రీ అర్హతతో కలిగిన ఈ పోస్టులకు దరఖాస్తు గడువు నేటితో..

TS High Court Typist Jobs: తెలంగాణ జిల్లా కోర్టుల్లో 144 టైపిస్ట్‌ పోస్టులకు దరఖాస్తు చేశారా? మరికొన్ని గంటల్లో ముగుస్తోన్న గడువు
Telangana High Court

Updated on: Jun 15, 2023 | 3:00 PM

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన 144 టైపిస్ట్‌ పోస్టుల భర్తీకి రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. డిగ్రీ అర్హతతో కలిగిన ఈ పోస్టులకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. జూన్‌ 15వ తేదీ (గురువారం) రాత్రి 11:59 గంటలకు దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులకు ఇది చివరి అవకాశం. ఎటువంటి రాత పరీక్షలేకుండా నేరుగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఐతే టైపింగ్‌ టెస్టు మాత్రం నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌ టెస్టులో నిమిషానికి 45 ఇంగ్లిష్‌ పదాలను టైప్‌ చేయగలగాలి. స్పీడ్‌ టైపింగ్ స్కిల్స్‌ ఉంటే జాబ్ పొందినట్లే. ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌ టెస్ట్‌ (స్కిల్‌ టెస్ట్‌) జులైలో ఉంటుంది. అంతేకాకుండా దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే దరఖాస్తు సమయంలో జనరల్/బీసీ అభ్యర్ధులు రూ.600, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.400 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.24,280ల నుంచి రూ.72,850ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు. ఈ రోజు గుడువు సమయం ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవల్సిందిగా అధికారులు సూచించారు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి వివరాలకు క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.