
తెలంగాణలోని గ్రూప్-2 ర్యాంకర్లకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2019 సెలెక్షన్ లిస్ట్‌ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. అయితే ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. 2019 గ్రూప్-2 సెలక్షన్ లిస్ట్‌లో కొన్ని అవకతవకలు జరిగాయనే కారణంతో ఆ మెరిట్ జాబితాను సింగిల్ బెంచ్ జడ్జి రద్దు చేశారు. దీంతో.. గ్రూప్-2లో సెలక్ట్ అయ్యి దాదాపు ఆరేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్లంతా మళ్లీ కోర్టులో అప్పీల్ చేశారు. కాగా ఇప్పుడు వారికి అనుకూలంగా డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది.
నిజానికి.. గ్రూప్-2లో OMR షీట్ల విషయంలోనే మొదట్నుంచి వివాదం ఉంది. పలువురు అభ్యర్థులు ట్యాంపరింగ్‌కి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. స్క్రాచింగ్, రీరైటింగ్, వైట్‌నర్ వాడడం లాంటి వివాదాల్లో ఉన్నవాళ్లకు కూడా పోస్టింగ్‌లు వచ్చాయని కొందరు కోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ జరిపిన ఇటీవల సింగిల్ బెంచ్ సెలక్షన్ లిస్ట్‌ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. దానిపై కొందరు అప్పీల్‌కు వెళ్లడంతో డివిజన్ బెంచ్ పాత తీర్పును సస్పెండ్ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.