CM Jagan: ఏపీ సీఎం జగన్.. ఎంపీ విజయసాయిరెడ్డికి ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్ల బదిలీకి హైకోర్టు నిరాకరణ..
ఏపీ ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయిరెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయిరెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. తీర్పు వెల్లడించకుండా స్టే ఇవ్వాలని, పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలన్న రఘురామ పిటిషన్‌పై హైకోర్టు కోరారు. అయితే ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ల బదిలీకి నిరాకరణ తెలిపింది. రఘురామ రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్లపై కాసేపట్లో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. రఘురామ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అయితే కోర్టు RRR పిటీషన్‌ను మాత్రమే తోసిపుచ్చింది. యదావిదిగా ఈ సాయంత్రం CBI కోర్టు జగన్ కేసులో తీర్పు చెప్పడానికి మార్గం సుగమం అయ్యింది.
బెయిల్ మంజూరు చేసినప్పుడు సీబీఐ కోర్టు విధించిన షరతులను జగన్ ఉల్లంఘిస్తున్నారంటూ జూన్ 4న రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసుతో సంబంధం లేని రఘురామ పిటిషన్ విచారణ అర్హతపై మొదట సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. రఘురామ వాదనతో ఏకీభవించిన సీబీఐ న్యాయస్థానం… పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. పిటిషనర్ వాదనలను పరిగణనలోకి తీసుకొని హైకోర్టు..
ఇవి కూడా చదవండి: Viral Video:నీటి గుంటలో ఎంచక్కా ఈత కొట్టేస్తున్న బుజ్జి కుక్క పిల్లలు.. మీ కళ్లను మీరే నమ్మలేరు..