TS High Court: వరి ధాన్యం కొనుగోలు వివరాలు తెలపండి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు..

| Edited By: Ravi Kiran

Nov 29, 2021 | 5:59 PM

వరి ధాన్యం కొనుగోలు వివరాలను వెంటనే తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిచింది తెలంగాణ హైకోర్టు. వరి ధాన్యం కొనుగోలు చేసేలా రాష్ట్రాన్ని ఆదేశించాలని హైకోర్టులో..

TS High Court: వరి ధాన్యం కొనుగోలు వివరాలు తెలపండి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు..
Telangana High Court
Follow us on

వరి ధాన్యం కొనుగోలు వివరాలను వెంటనే తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిచింది తెలంగాణ హైకోర్టు. వరి ధాన్యం కొనుగోలు చేసేలా రాష్ట్రాన్ని ఆదేశించాలని హైకోర్టులో న్యాయ విద్యార్థి బొమ్మనగారి శ్రీకర్ వేసిన పిల్‌పై కోర్టు విచారణ జరిపింది. ధాన్యం సేకరణకు ఎఫ్‌సీఐతో రాష్ట్రం ఒప్పందం చేసుకుందని పిటిషనర్ తన పిల్‌లో కోర్టు విన్నవించారు. 40లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు ఒప్పందం చేసుకుందని పిటిషనర్  వెల్లడించారు. ప్రభుత్వం కొనుగోలు చేయక రైతులు నష్టపోతున్నారని పిటిషనర్ తర్వఫు న్యాయవాది అభినవ్ వాధించారు. పంట నష్టపోయి రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని తెలిపారు.

కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేలా ఆదేశించాలన్నారు పిటిషనర్. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎఫ్‌సీఐకి ఆదేశాలివ్వాలన్నారు పిటిషనర్. వెంటనే వివరాలు తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎఫ్‌సీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ధాన్యం కొనుగోళ్లపై విచారణ డిసెంబరు 6కి వాయిదా వేసింది.

అయితే.. వరి ధాన్యాన్ని కోంటారా? లేదా?.. అప్పటి వరకూ క్లారిటీ లేదు.. ఎవరి మాట వారిదే. రాజకీయమంతా రైతుల చుట్టే తిరుగుతోంది. తెలంగాణ టు ఢిల్లీ. ఢిల్లీ టు తెలంగాణ. రెండు మీటింగ్‌లూ ముగిశాయి. కానీ అదే క్వశ్చన్ మార్క్.! పొలిటికల్ పొలాల్లో పంచ్‌ల నాట్లు పడుతూనే ఉన్నాయి. బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌.. మధ్యలో కాంగ్రెస్. ఈ ప్యాడీ పాలిటిక్స్‌ పార్లమెంట్‌ సెషన్స్‌నూ తాకడం ఖాయంగా కనిపిస్తోంది

ఇవి కూడా చదవండి: Omicron Variant: ఆందోళనకు గురి చేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్.. అసలు ఇది ప్రాణాంతకమా? కాదా?..

Telangana: శివాలయంలో అద్భుతం… చేద బావి నుంచి సలసలా మరిగే వేడి నీళ్లు