శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న 133 మంది మిడ్ వైఫరీ నర్సులకు త్వరలో పోస్టింగ్ ఇవ్వనున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావ్ తెలిపారు. పీహెచ్ సీ, మెడికల్ ఆఫీసర్స్, ఎ.ఎన్.ఎం, ఆశా వర్కర్ల పని తీరుపై నిర్వహించే నెల వారీ సమీక్షలో భాగంగా సోమవారం (అక్టోబర్ 10) నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీశ్ రావు ఈ మేరకు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..
ఆశాలు, ఎ.ఎన్.ఎంలు ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్లు వైద్య రంగానికి మూలస్తంభాలు. రోగాలను ప్రాధమిక దశలోనే గుర్తించి అవసరమైన వైద్యం అందిస్తే, వ్యాధి ముదరక ముందే రోగిని కాపాడవచ్చు. కేవలం మీరు రోగాలను నుండి కాపాడటమే కాకుండా.. రోగి కుటుంబం వైద్యం కోసం అప్పుల్లో పడకుండా ఆర్థికంగా కుంగిపోకుండా కాపాడిన వాళ్లం అవుతాం. ప్రతీ నెల క్రమం తప్పకుండా ఎ.ఎన్. సీలు చేయాలి. గత నెలలో అతి తక్కువ స్కోర్ ఉన్న జిల్లాలు వికారాబాద్, నాగర్ కర్నూల్, యాదాద్రి, వనపర్తి, జగిత్యాల. ఈ జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు ఎందుకు వెనకపడ్డాయో వివరణ ఇవ్వాలి. ఈ పరీక్షల్లో తేలిన ఫలితాలను బట్టి గర్భిణీ స్త్రీకి అవసరమైన ఐరన్ ట్యాబ్లెట్స్ ఇతర అవసరమైన సప్లిమెంటరీ మందులు అందేలా చూడాలి. కేసీఆర్ న్యూట్రిషిన్ కిట్ కూడా త్వరలో అందుబాటులోకి వస్తుంది.
గర్భిణీ స్త్రీలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వా ఆసుపత్రులకే వచ్చేలా అన్ని వసతులు కల్పించాలి
9 జిల్లాల్లో రక్త హీనత , పోషకాహర లోపం ఉన్న గర్భిణీ స్త్రీలకు ఈ న్యూట్రిషన్ కిట్ అందజేయడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీకి అవసరమైన స్కానింగ్‌లు చేయించాలి. 56 టిప్ఫా స్కాన్ మిషన్లను త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ మిషన్లు నిర్వహించే తీరుపై ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. టిప్ఫా స్కాన్ మిషన్లు వినియోగించి నాణ్యమైన వైద్యం తల్లి పిల్లకు అందించాలి. స్కానింగ్‌ల కోసం బయటకు వెళ్లకుండా చూడాలి. డెలివరీ తేదీని ముందే గుర్తించి 104 వాహనంలో దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయించాలి. ప్రయివేటు హస్పిటల్స్ లో డెలివరీలు 45 శాతంకు పైగా జరుగుతున్న జిల్లాలు ఆరు నిజామాబాద్, సూర్యపేట, హన్మకొండ, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో ఎక్కువ జరుగుతున్నయి. ఈ ఆరు జిల్లాలపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లా డీఎంహెచ్వోలు సమీక్ష జరపాలి. గత నెలలో అత్యధికంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో డెలివరీలు జరిగిన సబ్ సెంటర్లు మొత్తం 399 వరకు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 42 సబ్ సెంటర్లు, భద్రాద్రి కొత్తగూడెంలో 26 సబ్ సెంటర్లు, ఖమ్మం జిల్లాలో 24 సెంటర్లలో, మంచిర్యాల జిల్లాలో 23 సబ్ సెంటర్లు, నల్గొండ జిల్లాలో 27, సూర్యపేట జిల్లాలో 24,యాదాద్రి జిల్లాలో 20 సబ్ సెంటర్లు, జగిత్యాల జిల్లాలో 20 సబ్ సెంటర్లలో ప్రైవేటు ఆసుపత్రుల్లో డెలివరీలు జరిగాయి. ఈ సబ్ సెంటర్లలో ఎందుకు ఎక్కువగా ప్రైవేటు ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతున్నయో పరిశీలించాలి. వైద్యాధికారులు సమీక్ష జరిపి వచ్చే నెలలో ఈ పరిస్థితి లేకుండా చూడాలి. లేకుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎందుకు డెలివరీలు జరగట్లేదు?
మెదక్ జిల్లాలో 80 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డెలివరీలు జరుగుతున్నాయి. మెదక్, ములుగు జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 80 శాతం జరిగినప్పుడు మిగతా జిల్లాల్లో ఎందుకు జరగడం లేదన్నది పరీశీలించాలి. డీఎంహెచ్‌వోలు, సూపర్ వైజర్లు, ఆశాలు, ఎ.ఎన్.ఎంలు దీనిపై దృష్టి పెట్టాలి. కొత్తగా ఎంసీహెచ్ ఆసుపత్రులు అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక వైద్య సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వందకు వంద శాతం డెలివరీలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో గత నెలలో 57.99 శాతం సి సెక్షన్ ఆపరేషన్లు జరిగాయి. అత్యధికంగా సి – సెక్షన్ జరుగుతున్న జిల్లాలు ఎనిమిది. హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాద్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల సీ సెక్షన్ ఎక్కువ జరుగుతున్నాయి. వీటిని అరికట్టాలి. తల్లి బిడ్డ ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు నిర్థారిస్తే తప్ప సి సెక్షన్ ఆపరేషన్లు జరగకుండా చూడాలి. నార్మల్ డెలివరీ చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలి.
తల్లి-బిడ్డల ఇమ్యునైజేషన్‌పై శ్రద్ధ పెట్టండి..
మిడ్ వైఫరీ నర్సులు 133 మంది 18 నెలల శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. త్వరలో వారికి పోస్టింగ్ ఇవ్వనున్నాం. గర్భిణీ స్త్రీకి డెలివరీ ముందు అవసరమైన ఎక్సర్ సైజ్ లు చేయించాలి . తద్వారా నార్మల్ డెలివరీ అయ్యేందుకు ఉపయోగపడుతుంది. కేసీఆర్ కిట్ కూడా డెలివరీ రోజే అందించాలి. ఏ మాత్రం జాప్యం చేయవద్దు. పీహెచ్‌సీలలో అవుతున్న డెలివరీ లెబర్ రూం స్టెరిలైజేషన్ తప్పకుండా చేయాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం ఉన్నా తల్లి-బిడ్డకు ప్రమాదం. డెలివరీ అనంతరం తల్లి-బిడ్డలను 104 అమ్మ ఒడి వాహనంలో జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపాలి. బిడ్డ పుట్టిన తర్వాత ఇమ్యునైజేషన్ క్యాలెండర్ ప్రకారం క్రమం తప్పకుండా టీకాలు, వ్యాక్సిన్లు అందేలా చూడాలి. ఇమ్యునైజేషన్ తక్కువ జరిగిన జిల్లాలు పది. ఈ పది జిల్లాల్లో వందకు వంద శాతం ఇమ్యునైజేషన్ కార్యక్రమాలు జరిగాలి. ఈ దఫా రాష్ట్రంలో వర్షాలు బాగా కురిసాయి. దీని వల్ల గ్రామాల్లోని చెరువులు, కుంటలు, బావులు, గుంతల్లో నీరు చేరి దో మలు వృద్ధి చెందే అవకాశం ఉంది. వీటి ద్వారా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటివి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. గ్రామాల్లో అనారోగ్యం పాలయిన వారిని గుర్తించి, అవసరమైన వైద్యపరీక్షలు చేయాలి. సేకరించిన నమూనాలను తప్పనిసరిగా టీ- డయాగ్నోసిస్ సెంటర్ కు పంపాలి. అత్యల్పంగా శాంపిల్స్ టీ డయాగ్నోసిస్ కేంద్రాలకు పంపుతున్న పీహెచ్ సీలు ఆరు ఉన్నాయి. నెలలో 30 రోజలు శాంపిల్స్ పంపాల్సి ఉంది. ఎందుకు తక్కువ రోజులు పంపుతున్నారో డెరెక్టర్ హెల్త్ కు డీఎంఅండ్ హెచ్ వోలు నివేదిక పంపాలి.
ఈ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వంద శాతం డెలివరీలు.. మంత్రి హర్షం..
గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా పాము కాటు, తేలు కాటు, కుక్కు కాటు వంటి ప్రమాదాలు సంభవిస్తుంటాయి. అర్థరాత్రి అయినా అపరాత్రి అయినా సకాలంలో వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలి. సమీపంలోని పీహెచ్సీలలో తప్పకుండా కుక్కుకాటు, పాము కాటు, తేలు కాటుకు అవసరమైన మందులు స్టాక్ ఉండాలి. ఈ ఔషదిని ఎప్పటికప్పుడు వినియోగించుకోని, అవరమైన మందులు ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలి.మూడు నెలలకు సరిపడా మందులు ఉన్నాయ లేదా అన్నది చెక్ చేసుకోవాలి. పీహెచ్ సీలలో ఓపీ పెరగాలి. కరోనా బూస్టర్ డోస్ వందకు వంద శాతం జరగాలి. బీపీ, సుగర్ వ్యాధిగ్రస్థులను గుర్తించి, వారికి మందులు రెగ్యులర్ గా అందేలా చర్యలు తీసుకోవాలి. వారు మందులు వేసుకుంటున్నది లేనిది మానిటరింగ్ చేయాలి. టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారి సమాచారం అన్ లైన్లో పొందుపర్చాలి. తద్వారా వారికి డెరెక్ట్ బెనిఫిట్ స్కీంకు అర్హులవుతారు. పోషకాహర కిట్స్ అందుతాయి. కనుక డీఎంఅండ్ హెచ్వోలు టీబీ వ్యాధిగ్రస్తుల ను గుర్తించడంలో నిర్లక్ష్యం వహించవద్దు. రాష్ట్ర సగటు 85 శాతానికి ఏ జిల్లాతగ్గ కూడదు. సంగారెడ్డి జిల్లా ఖాజిపల్లి సబ్ సెంటర్ లో వందకు వంద శాతం ఎ.ఎన్. సి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు ఎ.ఎన్.ఎం. ఆశా కార్యకర్తలతో పాటు వైద్య సిబ్బంది అందరిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో పని చేయాలని కోరారు. మెదక్ జిల్లా, ములుగు జిల్లా రాష్ట్రంలో 80 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు చేసి ప్రధమ స్థానంలో నిలిచాయి. ఆ జిల్లాల డీఎంహెచ్వోలను, డాక్టర్లను, నర్సులను, ఎ.ఎన్.ఎం. ఆశా కార్యకర్తలను మంత్రి హరీశ్ రావు అభినందించారు.