
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. హిందూ దుమారం రేపుతున్నాయి. హిందూ సంఘాలతో పాటు రాజకీయ నేతల వరకు లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంతో డీహెచ్ రియాక్ట్ అయ్యారు. తన వ్యాఖ్యలు వక్రీకరించారంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఏసుక్రీస్తు దయ, కృప వల్లే కరోనా తగ్గుముఖం పట్టిందన్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రాజకుంది. డీహెచ్ కామెంట్స్‌ను తప్పుబట్టిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్ని మతాల గురించి ప్రజలకు చెప్పాల్సిన అధికారి ఒక్క మతానికి ఎలా కొమ్ముకాస్తాడు అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టిక్కెట్ కోసమే శ్రీనివాసరావు సీఎం కాళ్లు మొక్కుతానన్నాడని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక డీహెచ్ అవినీతి చిట్టా బయటపెడతామంటూ బండి సంజయ్ హెచ్చరించారు.
మరో వైపు శ్రీనివాసరావును వెంటనే సస్పెండ్ చేయాలని వీహెచ్‌పీ అంటే… హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని భజరంగ్‌దళ్ డిమాండ్ చేసింది. ఈ దుమారం నేపథ్యంలో స్పందించిన శ్రీనివాస రావు.. తన వ్యాఖ్యలను వక్రీకరించొద్దంటూ విజ్ఞప్తి చేశారు. తన ప్రసంగంలోని కొంత భాగాన్ని కట్ చేసి మీడియాలో వివాదం సృష్టించడం కలచివేసిందన్నారు. ప్రభుత్వ పనితీరు, ఆరోగ్య శాఖలో అన్ని స్థాయిల ఉద్యోగుల సహకారం, అన్ని మతాలకు చెందిన వారు వారివారి దేవతామూర్తులను ప్రార్థించుట వల్లే కరోనా సమసిపోయిందని తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారన్నారు. సర్వమతాల సారం ఒక్కటే అని నమ్ముతానంటూ ప్రకటన విడుదల చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..