Telangana Gurukul: తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పెంపు
Telangana Gurukul: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ జనరల్ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పరీక్ష తెలంగాణ గురుకుల సెట్ (టీజీసెట్)..
Telangana Gurukul: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ జనరల్ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పరీక్ష తెలంగాణ గురుకుల సెట్ (టీజీసెట్) దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఆసక్తి గల వారు ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని విద్యాలయాల సంస్థ కార్యదర్శి, సెట్ చీఫ్ కన్వీనర్ ఆర్‌ఎస్ ప్రవీన్ కుమార్ తెలిపారు.
కాగా, దరఖాస్తుల చేసుకునేందుకు ఏప్రిల్ 15వ తేదీతో గడువు ముగియగా, ఈనెల చివరి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులు చేసుకునే విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 45678కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు.