Telangana: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై అన్ని నియోజకవర్గాల్లో ఉమెన్ పెట్రోల్‌ బంక్స్‌!

రాష్ట్రంలో మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం సూపర్ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఇకపై వాటిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలకు విస్తరించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు సెర్ఫ్‌ ఆధ్వర్యంలో చమురు సంస్థలతో చర్చలను కూడా ప్రభుత్వం వేగవంతం చేస్తోంది.

Telangana: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై అన్ని నియోజకవర్గాల్లో ఉమెన్ పెట్రోల్‌ బంక్స్‌!
Women Run Petrol Pumps In Telangana

Updated on: May 25, 2026 | 10:06 AM

తెలంగాణలోని సాధికారత, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక స్థితిగతులను పెంపొందించే దిశకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మహిళా సమాఖ్యల ద్వారా పెట్రోల్ బంక్‌లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. అవి విజయవంతంగా నడుస్తుండడంతో వాటిని రాష్ట్రంలోని అన్ని నియోగజకవర్గాలకు విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో పెట్రోలు బంకులను ఏర్పాటు చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇందుకు సంబందించిన కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేసిన సెర్ఫ్‌ పనులను మరింత వేగవంతం చేసింది.

ప్రస్తుతం ప్రభుత్వం ప్రయోగాత్మకంగా మహిళా సమాఖ్యల ఆద్వరంలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంక్‌లు సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుండడంతో రాష్ట్రం వ్యాప్తంగా మరో 39 ప్రాంతాలలో కొత్త గా పెట్రోల్ బంకుల ఏర్పాటుకు చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇప్పటికే వాటి ఏర్పాటుకు సంబంధించిన పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో బంకుల ఏర్పాటు ప్రముఖ ఆయిల్ కంపెనీలైన HPCL, IOCL, BPCLతో సెర్ఫ్ చర్చలు జరిపింది. ఈ ఆయిల్ కంపెనీల సహాకారంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తొంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భసేకరణ ప్రక్రియ, లీజు ఒప్పందాలు, లేఅవుట్ల రూపకల్పనకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఆదిలాబాద్, వికారాబాద్, వనపర్తి, ఖమ్మం, కుమురంభీం, హనుమకొండ జిల్లాల్లో ఇప్పటికే స్థాలాన్ని గుర్తించండం, నిర్మాణ పనులు స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇక కరీంనగర్‌ జిల్లాలో బంక్‌ల ఏర్పాటుకు NOCలు లభించగా.. కామారెడ్డి, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఇప్పటికే లీజు ఒప్పందాల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మరికొన్ని ప్రాంతాల్లో NHAI, ఫైర్, పోలీస్, మున్సిపల్, రెవెన్యూ శాఖల నుంచి నుంచి అనుమతులు తీసుకునే పలనులు జరుగుతున్నాయి. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి.. త్వరగా నూతన పెట్రోల్ బంక్‌లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us