AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ.. రేవంత్ సర్కార్ బిగ్ డెసిషన్.. గ్రామానికి ఎంతమందంటే..?

తెలంగాణలో కూడా వాలంటీర్ల వ్యవస్థ రానుంది. ప్రతీ గ్రామానికి ముగ్గురు వ్యక్తుల చొప్పున ఉండనున్నాయి. తొలుత కొడంగల్ నియోజకవర్గంలో వీటిని నియమించన్నారు. ప్రస్తుతం వీరికి శిక్షణ అందిస్తున్నారు. రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ వ్యవస్ధ అనేది ఉండనుంది. పూర్తి వివరాలు ఇందులో చూద్దాం.

Telangana: తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ.. రేవంత్ సర్కార్ బిగ్ డెసిషన్.. గ్రామానికి ఎంతమందంటే..?
Telangana Government
Venkatrao Lella
|

Updated on: Apr 08, 2026 | 8:14 AM

Share

ఏపీలో అమలైన వాలంటీర్ల వ్యవస్థ గురించి అందరికీ తెలిసిందే. గ్రామాల్లోని జనాభా ప్రాతిపదికన వాలంటీర్లను గత ప్రభుత్వం నియమించింది. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను తొలగించింది. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై అనేక ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇలాంటి తరహా విధానాన్ని తెలంగాణలో అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. రైతులకు ఉపయోగపడేలా సాయిల్ హెల్త్ వాలంటీర్లను నియమించనున్నట్లు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ముగ్గురు వాలంటీర్లను నియమిస్తారు. ఇలా రాష్ట్రంలో మొత్తం 30 వేల మంది వాలంటీర్లను ప్రభుత్వం నియమించనుంది.

వాలంటీర్లు ఏం చేస్తారంటే..?

ఈ సాయిల్ హెల్త్ వాలంటీర్లు తమ పరిధిలో ఉన్న రైతులకు ఉపయోగపడనున్నారు. భూసారం ఎలా కాపాడాలి.. పంటకు అనుకూలంగా భూమిని ఎలా మార్చుకోవాలి లాంటి సలహాలు, సూచనలు చేస్తారు. రైతులకు భూసారంపై అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి ఎలా రాబట్టాలనే దానిపై రైతులకు సూచనలు చేస్తారు. ముందుగా ఈ వాలంటీర్లకు వాటిపై ట్రైనింగ్ కల్పిస్తారు. ఇక్రిశాట్‌లో తాజాగా తొలి విడతగా వాలంటీర్లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని తుమ్మల ప్రారంభించారు. ఇక్రిశాట్, తెలంగాణ వ్యవసాయ శాఖ ఈ వాలంటీర్లను నియమించనుంది. తొలుత సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎంపికైన వాలంటీర్లకు శిక్షణ అందిస్తున్నారు. వీరికి భూసారం, పంటల సాగు లాంటి అన్ని విషయాలపై ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తయిన అనంతరం వీళ్లు వీధులు స్టార్ట్ చేస్తారు.

సేంద్రీయ ఎరువులను వినియోగించండి

భూసార ఆరగ్య పరిరక్షణను ఉద్యమంలా చేపడతామని తుమ్మల తెలిపారు. పంట కొసాక వాటి అవశేషాలను తగలబెట్టకుండా ఎరువులుగా మార్చుకోవాలని రైతులకు సూచించారు. రసాయన ఎరువుల వాడకాన్ని రైతులు నిలిపివేయాలని, సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని పెంచాలన్నారు. భూమిలో రసాయనాలు లేకపోతే పౌష్టికాహారంతో కూడిన పంట పండుతుందన్నారు. జీలుగు, పిల్లిపెసర, పచ్చిరొట్ట విత్తనాల ద్వారా రైతులు భూసారాన్ని పెంచుకోవచ్చని తుమ్మల స్పష్టం చేశారు. అటు మే 4 నుంచి 9 వరకు రైతు ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఉత్సవాల్లో భారీగా రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Follow Us