AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: అద్భుతం జరగబోతుంది.. ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేట్‌లో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. సింగపూర్, టోక్యో తరహాలో ప్రపంచస్థాయి ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ఆయన తెలిపారు. రైతులు భాగస్వామ్యులై భూములివ్వాలని కోరారు. వారికి మంచి ఉద్యోగాలు, స్కిల్ యూనివర్సిటీలో శిక్షణ ఇస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ అభివృద్ధికి కొత్త మార్గాన్ని సూచిస్తుంది.

Revanth Reddy: అద్భుతం జరగబోతుంది.. ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Apr 28, 2026 | 8:52 PM

Share

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్‌ సిటీ నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేట్ లో “ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్” భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు సహా జిల్లా ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిపాదిత “ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్” భవనం ప్లాన్‌ను వీక్షించిన సీఎం… నాణ్యతలో రాజీపడొద్దని అధికారులు సూచించారు. భూమి పూజ అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం… ఫ్యూచర్‌ సిటీ నిర్మాణానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.

తమను కూడా ఫ్యూచర్ సిటీలో కలపాలని.. పలు గ్రామాలు విజ్ఞప్తి చేస్తున్నాయన్న సీఎం.. ఆ దిశగా కసరత్తు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు సూచించారు. గ్రామసభల ద్వారా తీర్మానం చేయించి.. వారి కోరిక ప్రకారం కొత్త కమిషనరేట్‌లో కలిసేలా చూడాలని ఆదేశించారు. సింగపూర్, టోక్యో, న్యూయార్క్ తరహాలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు రేవంత్‌రెడ్డి. ఒక్కొక్కటిగా వసతుల కల్పనలో ముందుకు వెళ్తున్నామన్నారు. జూన్ 2 లోగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఇక నుంచి ఫ్యూచర్‌ సిటీకి సంబంధించి .. ఆ భవనం నుంచే సమీక్షలు నిర్వహించి పెట్టుబడులను ఆహ్వానిస్తామన్నారు రేవంత్‌.

ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతామన్నారు రేవంత్‌. ఆ దిశగా రంగారెడ్డి జిల్లాలో అద్భుతం జరగబోతుందని చెప్పారు. తనపై నమ్మకంతో రైతులు భూములిచ్చి.. ఫ్యూచర్‌ సిటీ నిర్మాణంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. కొత్త నగరం కోసం సహకారం అందించేవారు.. చరిత్రలో నిలిచిపోతారన్న సీఎం… భూములిచ్చిన రైతుల్ని ఆదుకునే బాధ్యత తనదని చెప్పారు. గతంలో కాలుష్యకారక ఫార్మా సిటీని వ్యతిరేకించి.. భవిష్యత్ నగరాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చానన్నారు సీఎం. స్థానిక రైతుల పిల్లలకు స్కిల్‌ యూనివర్సిటీలో ట్రైనింగ్‌ ఇచ్చి.. మంచి ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వేసవిలో మీ తోట పచ్చగా ఉండాలా? ఈ గార్డెనింగ్ చిట్కాలు మీ కోసమే!
వేసవిలో మీ తోట పచ్చగా ఉండాలా? ఈ గార్డెనింగ్ చిట్కాలు మీ కోసమే!
మే 1 నుంచి పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు..?
మే 1 నుంచి పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు..?
కోడిలోని ఈ భాగాలు యమ డేంజర్.. తింటే ఆస్పత్రికెళ్లడం పక్కా..
కోడిలోని ఈ భాగాలు యమ డేంజర్.. తింటే ఆస్పత్రికెళ్లడం పక్కా..
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. మరికొన్ని గంటల్లో టెన్త్‌ రిజల్ట్స్‌
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. మరికొన్ని గంటల్లో టెన్త్‌ రిజల్ట్స్‌
ఆ రెండే కాదు.. టెన్త్ తర్వాత మీ ఫ్యూచర్ కోర్సులు
ఆ రెండే కాదు.. టెన్త్ తర్వాత మీ ఫ్యూచర్ కోర్సులు
బాల్కనీ నుంచి దూకి చచ్చిపోవాలనిపించింది: జబర్దస్త్ అవినాష్
బాల్కనీ నుంచి దూకి చచ్చిపోవాలనిపించింది: జబర్దస్త్ అవినాష్
స్వచ్ఛమైన బంగారం లాంటి ఈ విత్తనాలు రోజుకు ఒక చెంచా తింటే చాలు..
స్వచ్ఛమైన బంగారం లాంటి ఈ విత్తనాలు రోజుకు ఒక చెంచా తింటే చాలు..
ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి
ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి
తిరుమలలో బిగ్ క్యాంటీన్లు.. భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం
తిరుమలలో బిగ్ క్యాంటీన్లు.. భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం
ఆ 4 బ్రేక్‌ఫాస్ట్‌లు వదిలేయండి.. జస్ట్ ఈ 4 తినండి
ఆ 4 బ్రేక్‌ఫాస్ట్‌లు వదిలేయండి.. జస్ట్ ఈ 4 తినండి