Corona Vaccination: కరోనా వ్యాక్సిన్‌ను తామే సొంతంగా వేసుకుంటామంటూ మొండికేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. టీకా పంపిణీ అంతా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుందని తేల్చి చెప్పింది. తమ ఆస్పత్రుల్లోని సిబ్బందికి తామే టీకాను వేసుకుంటామని, వ్యాక్సిన్ డోసులను తమకే ఇవ్వాలని రాష్ట్రంలో గల పలు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. దీనికి స్పందించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ.. అలాంటివి కుదరవు అని కుండబద్దలు కొట్టింది. కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు కానివారికి టీకి ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ప్రైవేటు ఆస్పత్రి సిబ్బందికి కూడా ప్రభుత్వమే టీకా వేస్తుందని కుండబద్దలు కొట్టింది. ప్రైవేటుకు వ్యాక్సిన్ సప్లయ్ చేస్తే అది పక్కదారి పట్టే అవకాశం ఉందని వైద్యఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇదిలాఉండగా, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ముందుగా కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన వైద్య ఆరోగ్య సిబ్బందికి టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో ఆరోగ్య కార్యకర్తల పేర్లు నమోదు చేయాలని ఆదేశించింది. అయితే, పలు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు మాత్రం ఇప్పటి వరకు ఆ దిశగ ముందడుగు వేస్తున్నట్లు కనిపించడం లేదు. ప్రభుత్వానికి సహకరించకపోగా.. టీకా తమకే ఇవ్వాలని మొండికేస్తున్నాయి. రికార్డుల్లో నమోదు కాని ఆస్పత్రులు, నకిలీ క్లినిక్‌లైతే తమ వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనని ఆందోళన కారణంగానే పలు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఇలా చేస్తున్నాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మరి కొవిన్‌లో నమోదు కాని ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి కరోనా టీకా ఎలా వేస్తారనేది ప్రభుత్వం చేతుల్లోనే ఉంది.
Also read:
Corona Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌కు సిద్ధమవండి.. అధికారులను ఆదేశించిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ..