Telangana Govt: తెలంగాణ విద్యార్థులకు ముఖ్య గమనిక.. విదేశీ చదువుల కోసం ప్రయత్నిస్తున్నారా?.. రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం..

|

Feb 03, 2021 | 5:55 AM

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Telangana Govt: తెలంగాణ విద్యార్థులకు ముఖ్య గమనిక.. విదేశీ చదువుల కోసం ప్రయత్నిస్తున్నారా?.. రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం..
Gangula
Follow us on

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ విషయాన్ని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ, ఈబీసీ విద్యార్థులకు మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యానిధి పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. గురువారం నుంచి మార్చి 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని మంత్రి తన ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఈ-పాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తుకు సంబంధించిన వివరాలు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. బీసీ విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి గుంగుల సూచించారు. టాలెంట్ ఉండి.. విదేశాల్లో చదవే ఆర్థిక స్తోమత లేక ఎంతో మంది విద్యార్థుల జీవితాలు ఆగమైపోతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లో చదువుకోవాలనుకునే పేద విద్యార్థల కోసం రాష్ట్ర ప్రభుత్వం ధన సాయం చేస్తోంది. ప్రతి ఏటా ఈ పథకం ద్వారా ఎంతో మంది విద్యార్థులను విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నారు.

Also read:

దేశరాజధానిలో హై అలర్ట్ : ఢిల్లీలో మరిన్ని బాంబు దాడులు జరగబోతున్నట్లు చెప్పకనే చెబుతున్న తాజా పరిణామాలు

Krack Movie: మరో పాటను విడుదల చేసిన ‘క్రాక్‌’ సినిమా యూనిట్‌… క్లాస్‌ కళ్యాణీ మాస్‌ స్టెప్పులు చూశారా..?