Telangana Inter Board: ఇంటర్‌ ఫస్టియర్ ఫెయిల్‌ అయిన విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం..!

Telangana Inter Board: తెలంగాణ ఇంటర్మీడియేట్‌ ఫస్టియర్‌ పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఏడాది పరీక్షల్లో చాలా మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు...

Telangana Inter Board: ఇంటర్‌ ఫస్టియర్ ఫెయిల్‌ అయిన విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం..!

Updated on: Jan 07, 2022 | 11:24 AM

Telangana Inter Board: తెలంగాణ ఇంటర్మీడియేట్‌ ఫస్టియర్‌ పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఏడాది పరీక్షల్లో చాలా మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. తక్కువ శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు ఫెయిల్‌ కావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తర్వాత ఫెయిల్‌ అయిన విద్యార్థులను పాస్‌ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్థుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియేట్‌ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు కనీస మార్కులు వేసినట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. ఇంటర్‌ బోర్డు వెబ్ సైట్‌ ద్వారా శనివారం నుంచి మెమోలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది.

రాష్ట్రంలో ఫెయిల్‌ అయిన విద్యార్థుల రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు చెల్లించిన ఫీజును వెనక్కి తీసుకునే అవకాశం కల్పించింది ఇంటర్‌ బోర్డు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి జనవరి 17వ తేదీ వరకు రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌కు దరఖాస్తు రద్దుకు అవకాశం కల్పించినట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది. విద్యార్థులు చెల్లించిన ఫీజును ఫిబ్రవరి 1 నుంచి కాలేజీల్లో తీసుకోవాలని సూచించింది.

ఇవి కూడా చదవండి:

Stress Monitoring: చెమట ద్వారా ఒత్తిడిని గుర్తించి సమాచారం అందించే సరికొత్త వాచ్‌.. ఇది ఎలా పని చేస్తుంది..?

Heart Disease: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సమయానికి నిద్రించాలి.. పరిశోధనలలో వెలుగు చూసిన కీలక అంశాలు..!