Telangana: కొత్తగా మరో 8 మెడికల్‌ కాలేజీలకు తెలంగాణ సర్కార్ అనుమతి.. భారీగా పెరిగిన ఎంబీబీఎస్‌ సీట్లు

తెలంగాణకు కొత్తగా మరో 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు రానున్నాయి. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ సర్కార్ బుధవారం (జులై 5) ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా మంజూరైనా మెడికల్ కాలేజీలు..

Telangana: కొత్తగా మరో 8 మెడికల్‌ కాలేజీలకు తెలంగాణ సర్కార్ అనుమతి.. భారీగా పెరిగిన ఎంబీబీఎస్‌ సీట్లు
CM KCR

Updated on: Jul 05, 2023 | 5:28 PM

హైదరాబాద్‌: తెలంగాణకు కొత్తగా మరో 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు రానున్నాయి. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ సర్కార్ బుధవారం (జులై 5) ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా మంజూరైనా మెడికల్ కాలేజీలు జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే అరుదైన రికార్డు దక్కించుకుంది. దీంతో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలనే సీఎం కేసీఆర్ లక్ష్యం త్వరలోనే నెరవేరబోతోంది. కేసీఆర్‌ పాలనలో గత 9 ఏళ్ల కాలంలో మొత్తం 29 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయి.

దీంతో రాష్ట్రంలో మొత్తం ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 10 వేలకు చేరువకానున్నాయి. మారుమూల ప్రాంతాలకు సైతం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువవుతున్నాయి. స్థానికంగా ఉంటూనే ఎంబీబీఎస్ చదివేందుకు అవకాశాలు పెరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే సీఎం కేసీఆర్ లక్ష్యం సాకారమవుతుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వైద్య విద్య విప్లవమిది అని మంత్రి హరీశ్ వాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.