Telangana: రాష్ట్రంలో మరో 18 కొత్త మండలాల ఏర్పాటు.. ఏయే జిల్లాలో ఏవో చెక్ చేసుకోండి

| Edited By: Janardhan Veluru

Jul 23, 2022 | 5:12 PM

Telangana: ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కారు తాజాగా...

Telangana: రాష్ట్రంలో మరో 18 కొత్త మండలాల ఏర్పాటు.. ఏయే జిల్లాలో ఏవో చెక్ చేసుకోండి
Follow us on

Telangana: ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కారు తాజాగా రాష్ట్రంలో మరికొన్ని మండలాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రజల ఆకాంక్షలను, స్థానిక ప్రజల అవసరాలను పరిశీలించి కొత్త మండలాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో మొత్తం 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ సోమేశ్‌ కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటయిన కొత్త మండలాలు ఇవే..

* నారాయణ పేట జిల్లాలో గుండుమల్, కొత్తపల్లె.

* వికారాబాద్ జిల్లాలో దుడ్యాల్.

ఇవి కూడా చదవండి

* మహబూబ్ నగర్ జిల్లాలో కౌకుంట్ల.

* నిజామాబాద్ జిల్లాలో ఆలూర్, డొంకేశ్వర్.

* నిజామాబాద్ జిల్లాలో సాలూర.

* మహబూబాబాద్ జిల్లాలో సీరోల్.

* నల్లగొండ జిల్లాలో గట్టుప్పల్.

* సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట్.

* కామారెడ్డి జిల్లాలోని డోంగ్లి.

* జగిత్యాల జిల్లాలో ఎండపల్లి, భీమారం మండలాను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..