TS Governor: తెలంగాణ గవర్నర్ ఢిల్లీ పర్యటన రద్దయింది. అకస్మాత్తుగా టూర్ క్యాన్సిల్ కావడానికి కారణం ఏంటి ? ఎందుకు రమ్మన్నారు ? ఎవరు రద్దు చేశారు? అనే సందేహాలు కలుగకమానదు. అయితే గవర్నర్ తమిళిసై (Tamilisai) ఢిల్లీ పర్యటన (Delhi Tour) రద్దు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ టూర్ ఎందుకు రద్దయింది? ఎవరు పిలిచారు? ఇప్పుడు ఎందుకు వద్దన్నారనే టాపిక్.. హాట్ టాపిక్‌గా మారింది. నిన్న పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ చేరుకున్న గవర్నర్ తమిళిసై నిన్న రాత్రే ఢిల్లీ ఫ్లయిట్ ఎక్కాల్సి ఉంది. అయితే అది కాస్తా ఇవాళ ఉదయానికి వాయిదా పడింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఏకంగా ఢిల్లీ పర్యటనే రద్దయింది.
అంతకుముందు గవర్నర్ తమిళిసైకి ఢిల్లీ రావాలని పిలుపు వచ్చింది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షాతో మీటింగ్ ఉందని కబురు రావడంతో ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు గవర్నర్. ఒకవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉండగా, ఇటు గవర్నర్ కి కూడా ఢిల్లీ నుంచి పిలుపు రావడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపింది. తెలంగాణలో ప్రగతిభవన్‌కు, రాజ్‌భవన్‌కి మధ్య గ్యాప్ రావడంతో ఈ పర్యటన ఆసక్తి రేపింది. రిపబ్లిక్ డే నుంచి ఉగాది సెలబ్రేషన్స్ వరకు అటు ప్రభుత్వానికి ఇటు గవర్నర్ మధ్య విభేదాలు కొనసాగాయి. గవర్నర్ లేకుండానే తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ సెషన్ నిర్వహించింది. దీంతో త్వరలోనే ప్రజాదర్భార్ నిర్వహిస్తానంటూ గవర్నర్ సర్కార్‌కు సవాల్ చేయడంతో సీఎం వర్సెస్ గవర్నర్ ఎపిసోడ్ సమ్మర్‌లో ఇటు మరింత హీట్ పెంచింది. దీంతో ఇలాంటి సమయంలో ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో అటు ప్రధాని మోదీ, ఇటు అమిత్‌షా గవర్నర్ నుంచి ఏ ఇన్‌పర్మేషన్ తీసుకుంటారు ? ఆ తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? నెక్ట్స్ స్టెప్ ఏంటనే ఉత్కంఠ మొదలైంది. అయితే అకస్మాత్తుగా గవర్నర్ ఢిల్లీ పర్యటన రద్దు కావడంతో ఈ అంశం కూడా చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి: