Pravalica Suicide: విద్యార్థిని ప్రవళిక మృతిపై ప్రముఖుల స్పందన.. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని సూచన..

హైదరాబాద్ అశోక్ నగర్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ప్రవళిక మృతిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రవళిక ఆత్మహత్య బాధాకరం అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. విద్యార్థినిది ఆత్మహత్య కాదు.. హత్య అని రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు రాహుల్. నిరుద్యోగంతో తెలంగాణ విలవిలలాడుతోందన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేశాయని విమర్శించారు. తెలంగాణలో...

Pravalica Suicide: విద్యార్థిని ప్రవళిక మృతిపై ప్రముఖుల స్పందన.. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని సూచన..
Governor Tamilisai Responds

Updated on: Oct 14, 2023 | 1:30 PM

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: హైదరాబాద్ అశోక్ నగర్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ప్రవళిక మృతిపై రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. యువతి మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాల వల్లే ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రవళిక ఆత్మహత్యపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. 48 గంటల్లో ప్రవల్లిక ఆత్మహత్యపై రిపోర్ట్ చేయాలని సీఏస్ కు, డీజీపీ, టీఏస్పీఏస్సీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ప్రవల్లిక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు గవర్నర్. ప్రవళిక ఆత్మహత్య పోటీ పరిక్షకు సిద్ధం అవుతున్న నిరుద్యోగుల సవాళ్లు, ప్రతిసవాల్లను గుర్తు చేస్తుందన్నారు. గ్రూప్2 పరిక్ష వాయిదా వేస్తున్నట్లు టీఏస్పీఏస్సీ తన దృష్టికి తీసుకువచ్చిందన్నారు. నిరుద్యోగ యువత ధైర్యంతో ఉండాలని, నిరుద్యోగులకు తాను ఎప్పుడు అండగా ఉంటానని అన్నారు.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రవళిక ఆత్మహత్య బాధాకరం అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. విద్యార్థినిది ఆత్మహత్య కాదు.. హత్య అని రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు రాహుల్. నిరుద్యోగంతో తెలంగాణ విలవిలలాడుతోందన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేశాయని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే..ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తామని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. అధికారం చేపట్టిన నెల వ్యవధిలోనే టీఎస్‌పీఎస్‌సీని పునర్వ్యవస్థీకరిస్తామని తెలిపారు. ఏడాదిలోపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఉద్యోగార్థులు ధైర్యం కోల్పోవద్దని, వచ్చేది కాంగ్రెస్సే అని భరోసా ఇచ్చారు.

సంతాపం తెలిపిన మల్లికార్జున ఖర్గే..

ప్రవళిక మృతిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. తెలంగాణలోని 23 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం దిగ్భ్రాంతికి, తీవ్ర వేదనకు గురిచేసిందన్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలను పదేపదే వాయిదా వేయడం, అవకతవకల కారణంగానే యువతి తన జీవితానికి ముగింపు పలికిందన్నారు. ప్రవళిక కుటుంబానికి సంతాపం తెలిపారు ఖర్గే. పరీక్షల నిర్వహణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉదాసీనత కారణంగా తెలంగాణలోని వేలాది మంది యువ ఔత్సాహికులు నిరాశ, కోపంతో ఉన్నారన్నారు. తెలంగాణ యువకులు అవినీతి, అసమర్థమైన బీఆర్ఎస్‌ను గద్దె నుంచి దించాలన్నారు.

ప్రవళిక ఆత్మహత్యపై స్పందించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి..

ప్రవల్లిక ఆత్మహత్య చాలా బాధాకరం అన్నారు. ప్రవళికది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య అని వ్యాఖ్యానించారు. రెండు సార్లు గ్రూప్ పరీక్షలు వాయిదా పడడం వల్లే యువతి ఆత్మహత్య చేసుకుందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో తెలంగాణ ఉద్యమం సాగిందన్నారు. ‘విద్యార్థులు, నిరుద్యోగులకు చేతులెత్తి మొక్కుతున్నా.. మీరు ధైర్యంగా ఉండండి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తాం.’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై నోటికొచ్చినట్టు మాట్లాడే కేటీఆర్ ప్రవళిక ఆత్మహత్యపై ట్విట్టర్లో స్పందించాలని డిమాండ్ చేశారు. తమ పొరపాటుతోనే పరీక్ష జరపలేకపోయామని ఒప్పుకుంటూ విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు..

అశోక్ నగర్ విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్యపై పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రవళిక మృతదేహం వద్ద లభించిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె మృతిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..