Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. రైతుబంధు జాబితా రెడీ.. ఎల్లుండి నుంచి ఖాతాల్లోకి నిధులు..

|

Jun 13, 2021 | 4:17 PM

రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ చేసేందుకు  ఏర్పాట్లు పూతయ్యాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.

Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. రైతుబంధు జాబితా రెడీ.. ఎల్లుండి నుంచి ఖాతాల్లోకి నిధులు..
Rythu Bandhu
Follow us on

రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ చేసేందుకు  ఏర్పాట్లు పూతయ్యాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 15 నుంచి రైతుబంధు పథకం నిధుల విడుదల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఎల్లుండి(మంగళవారం) నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని అన్నారు. రైతుబంధు పథకానికి అర్హులైన రైతుల జాబితా సీసీఎల్‌ఏ అందజేసిందని వెల్లడించారు. రైతుబంధు పథకానికి 63.25లక్షల మంది రైతులు అర్హులుగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. ఈ పథకానికి 63,25,695 మంది అర్హులైన రైతులకు చెందిన 150.18లక్షల ఎకరాలకు 7508.78 కోట్ల రూపాయలు అవసరమవుతాయని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. గత యాసంగి కన్నా 2.81లక్షల మంది రైతులు పెరిగారని…నూతనంగా 66,311ఎకరాలు ఈ పథకంలో చేరాయని మంత్రి తెలిపారు. రైతుబంధు నిధులు ఈ నెల 15 నుంచి 25 వరకు రైతుల ఖాతాలలో జమ అయితామని వ్యవసాయశాఖ మంత్రి స్పష్టం చేశారు.

బ్యాంకుల విలీనంతో ఐఎఫ్ఎస్​సీ కోడ్​లు మారిన ఖాతాదారులు ఆందోళన చెందవద్దని… ఏమైనా అనుమానాలుంటే స్థానిక వ్యవసాయాధికారులు నివృత్తి చేస్తారని తెలిపారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 4,72,983 మంది రైతులు అర్హులుండగా… 12.18 లక్షల ఎకరాలకు 608.81 కోట్లు నిధులు అవసరం అవుతాయన్నారు. నెల 10వ తేదీ వరకు మొత్తం 2.22 లక్షల మంది రైతులను పార్ట్‌ బీ నుంచి పార్ట్‌- ఏ ఖాతాల్లోకి మార్చినట్లు రెవెన్యూశాఖ అధికారులు వెల్లడించారు. వీరి పేర్లకు వారి బ్యాంకు అకౌంట్‌ నెంబర్‌, ఇతర వివరాలు పరిశీలించి రైతుబంధు పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

మొదటిసారి అర్హులైన రైతులు స్థానిక ఏఈఓలు, ఏఓలను కలిసి పట్టాదార్ పాసు పుస్తకాలు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో కూడిన నకలు అందించాలని తెలిపారు. బ్యాంకుల విలీనంతో ఐఎఫ్ఎస్ సీ కోడ్ లు మారిన ఖాతాదారులు ఆందోళన చెందవద్దన్నారు. ఏమైన అనుమానాలుంటే స్థానిక వ్యవసాయాధికారులు నివృత్తి చేస్తారని సూచించారు.

ఇవి కూడా చదవండి: Balaji Temple in Jammu: జమ్మూలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ.. హాజ‌రైన ప్ర‌ముఖులు వీరే

Jacqueline Fernandez: పానీ పానీ సాంగ్‌ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్రీలంకన్ లేడీ..