Telangana: తెలంగాణలో టీకా కొరత.. బూస్టర్ డోస్ కోసం క్యూ కడుతున్న జనం..

తెలంగాణలోనూ కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రంలో బూస్టర్ డోస్ టీకా తీసుకునేవారి సంఖ్య ఇటీవల పెరిగింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మరో రెండు రోజుల వరకు సరిపడే టీకా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఆతర్వాత వ్యాక్సిన్ కొరత ఏర్పడే అవకాశం ఉండటంతో తమకు కోవిడ్ టీకా డోసులు పంపించాలని

Telangana: తెలంగాణలో టీకా కొరత.. బూస్టర్ డోస్ కోసం క్యూ కడుతున్న జనం..
Covid 19 Vaccine
Follow us
Amarnadh Daneti

|

Updated on: Aug 11, 2022 | 9:36 AM

Telangana Covid: దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో కరోనా టీకా బూస్టర్ డోస్ తీసుకునేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. 18 సంవత్సరాలు పైబడి.. రెండు డోసులు కోవిడ్ టీకా వేయించుకున్న వారు బూస్టర్ డోస్ తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అయితే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయనే ఉద్దేశంతో చాలా మంది బూస్టర్ డోస్ పై పెద్ద ఇంటరెస్ట్ చూపించలేదు. గత కొద్దిరోజులుగా కోవిడ్ కేసులు పెరగుతుండటంతో కోవిడ్ టీకాల కోసం వ్యాక్సినేషన్ సెంటర్లకు క్యూ కడుతున్నారు జనం. ఈక్రమంలో తెలంగాణలోనూ కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రంలో బూస్టర్ డోస్ టీకా తీసుకునేవారి సంఖ్య ఇటీవల పెరిగింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మరో రెండు రోజుల వరకు సరిపడే టీకా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఆతర్వాత వ్యాక్సిన్ కొరత ఏర్పడే అవకాశం ఉండటంతో తమకు కోవిడ్ టీకా డోసులు పంపించాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. తెలంగాణ వ్యాప్తంగా రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదవుతుండగా.. వాటిలో 70శాతం కేసులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. దీంతో కరోనా కట్టడికి చర్యలు ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. కోవిడ్ నివారణకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు రాష్ట్ర ప్రజలను కోరారు.

ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు లక్ష వరకు కోవిడ్ టీకా డోసులు వేస్తుండగా.. వీటిలో 90 వేలకు పైగా బూస్టర్ డోస్ తీసుకునే వాళ్లే ఉన్నారు. మిగతా పది శాతం మొదటి, రెండో డోసు తీసుకుంటున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ కోవిడ్ టీకా బూస్టర్ డోస్ ను దాదాపు 30 లక్షల మంది వరకు తీసుకోగా.. వీరిలో కోవిషీల్డ్ టీకా తీస్కున్నవారే ఎక్కువగా ఉన్నారు. దీంతో.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ కొరత ఏర్పడే అవకాశాలు ఉండటంతో రాష్ట్రప్రభుత్వం జాగ్రత్తపడింది. మొత్తంగా కోల్డ్ చైన్ పాయింట్స్, డిస్ట్రిక్ వ్యాక్సిన్ స్టోర్స్ లలో 80 వేల డోసులు ఉండగా, స్టేట్ వ్యాక్సినేషన్ స్టోర్ లో కేవలం 70 వేల డోసులు మాత్రమే ఉన్నాయి. దీంతో రాష్ట్రానికి 50 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు పంపాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావు కేంద్రానికి లేఖ రాసారు. తెలంగాణలో 15 లక్షల వరకూ కోవాగ్జిన్ టీకా డోసుల నిల్వలు ఉన్నాయి. కోవిషీల్డ్ టీకాల కొరత ఏర్పడడంతో.. రెండు మూడు రోజుల్లో కేంద్రం నుంచి కోవిషీల్డ్ డోసులు రానట్లయితే.. వ్యాక్సినేషన్ సెంటర్లలో టీకాల కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?