AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రేషన్ కార్డు ఉంటే అకౌంట్లోకి రూ.5 లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం.. జూన్ 2 నుంచే..!

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తీపికబురు అందించింది. వచ్చే నెల జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వస్తోంది. ఆ రోజున అనేక కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని అమలు చేయనుంది.

Telangana: రేషన్ కార్డు ఉంటే అకౌంట్లోకి రూ.5 లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం.. జూన్ 2 నుంచే..!
Telangana
Venkatrao Lella
|

Updated on: May 20, 2026 | 5:53 PM

Share

తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్ అందించనుంది. జూన్ 2వ తేదీన కీలక పథకానికి శ్రీకారం చుట్టనుంది. అదే ఇందిరమ్మ జీవిత బీమా పథకం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన ఈ పథకం ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ సమాయత్తం అవుతోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పేదలకు రూ.5 లక్షల బీమా అందించనుంది. రేషన్ కార్డు ఉన్నవారందరికీ ఈ పథకం వర్తించనుంది. కుటుంబ యజమాని మరణిస్తే కుటుంబసభ్యులకు రూ.5 లక్షల సాయం అందించనుంది. దీంతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలను కూడా అమలు చేసేందుకు సిద్దమవుతోంది.

జూన్ 2 నుంచి అమలు

ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు చేసేందుకు జూన్ 2న ఎల్‌ఐసీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునే అవకాశముందని తెలుస్తోంది. గతంలో ఆ స్కీమ్ గరించి మీడియా సమావేశంలో రేవంత్ వెల్లడించారు. జూన్ 2 నుంచి దీనిని అమలు చేస్తామని ప్రకటించారు. త్వరలో గడువు తేదీ దగ్గర పడుతుండటంతో పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. దీంతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలను కూడా కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించనుంది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు కొత్త పింఛన్లను అందించలేదు. దీంతో 2 లక్షల మందికి కొత్తగా పింఛన్లు అందించాలని ప్రభుత్వం చూస్తోంది. పింఛన్ పెంపుపై కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

రెండో దశ ఇళ్లకు నిధులు

ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రెండో దశ ఇళ్ల మంజూరుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రెండో దశలో చేపట్టనున్న ఇళ్ల నిర్మాణాలకు జూన్ 2వ తేదీ నుంచి నిధులు విడుదల చేయనుంది. అంతేకాకండా అదే రోజున మరో కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబసభ్యులు డిజిటల్ హెల్త్ కార్డులను అందించనున్నారని తెలుస్తోంది. ఈ కార్డులతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ పొందవచ్చు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ స్కీమ్ అమలు చేసేందుకు ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే కార్డులను జారీ చేసేందుకు డేటాను కూడా సేకరించింది. మే 31లోగా డేటా సేకరణ ప్రక్రియ పూర్తి కానుంది. ఇక జూన్ 2న సనత్ నగర్ టిమ్స్ ప్రారంభం, నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉపాధి పొందేలా శిక్షణ వంటి కార్యక్రమాలు ప్రారంభించనుంది.

Follow Us
రేషన్ కార్డు ఉన్నవారికి రూ.5 లక్షలు.. రేవంత్ సర్కార్ కొత్త స్కీమ్
రేషన్ కార్డు ఉన్నవారికి రూ.5 లక్షలు.. రేవంత్ సర్కార్ కొత్త స్కీమ్
మేడం సార్ మేడం అంతే.. త్రిష మరో ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారా..?
మేడం సార్ మేడం అంతే.. త్రిష మరో ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారా..?
అకస్మాత్తుగా ఆగిన సీఎం చంద్రబాబు కాన్వాయ్.. ఆ తర్వాత
అకస్మాత్తుగా ఆగిన సీఎం చంద్రబాబు కాన్వాయ్.. ఆ తర్వాత
ఓరీ దేవుడో.. ఇంత చిన్న చీమలో అంత పవర్ ఉంటుందా? ఈ నిజాలు తెలిస్తే
ఓరీ దేవుడో.. ఇంత చిన్న చీమలో అంత పవర్ ఉంటుందా? ఈ నిజాలు తెలిస్తే
వరుసగా 4 రోజుల పాటు ఎస్బీఐ బ్యాంక్‌లు బంద్
వరుసగా 4 రోజుల పాటు ఎస్బీఐ బ్యాంక్‌లు బంద్
చదువుల తల్లిని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి.. వీడియో ఇదిగో..
చదువుల తల్లిని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి.. వీడియో ఇదిగో..
వేడిని తరిమికొట్టే మజ్జిగలో ఈ పొడి వేసుకుని తాగారంటే..
వేడిని తరిమికొట్టే మజ్జిగలో ఈ పొడి వేసుకుని తాగారంటే..
నీట్ పరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు: ధర్మేంద్ర ప్రధాన్
నీట్ పరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు: ధర్మేంద్ర ప్రధాన్
అయ్యో పాపం కొత్త పెళ్లి కొడుకు..మొదటి రాత్రి భార్యను చూసి పరార్
అయ్యో పాపం కొత్త పెళ్లి కొడుకు..మొదటి రాత్రి భార్యను చూసి పరార్
చంద్రుడి కటాక్షం.. ఈ రాశులకు ధన ధాన్య యోగం ఖాయం!
చంద్రుడి కటాక్షం.. ఈ రాశులకు ధన ధాన్య యోగం ఖాయం!