తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థలో వేగంగా ముందుకు దూసుకుపోతోంది. ఇవాళ్టి నుంచి కేజీ టు పీజీ వరకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తోంది. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. 2021-22 సంవత్సరానికిగాను 3వ తరగతి నుంచి 10 తరగతి వరకు క్లాసులు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. పాఠ్యంశాల వివరాలు… టైంటేబుల్‌ను విడుదల చేసింది. విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకు అన్ని విధాలుగా రెడీగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇదిలావుంటే.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని మండల విద్యాధికారులు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠ్యాంశాలను తరగతి వారీగా విద్యార్థులు చూసే విధంగా చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించేలా చూడాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి నుంచి 10వ తరగతి వరకు తరగతులను నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్ తరగతుల నిర్వహణలో పాటించాల్సిన సూచనలను క్రమం తప్పకుండా పాటించేలా మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చారు. తరగతుల వారీగా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకుంటారు. విద్యార్థులు పాఠాలు వినేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాంది రాష్ట్ర విద్యా శాఖ.