తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతుంది. అటు అభివృద్ధికి, ఇటు సంక్షేమానికి సమపాళ్లలో ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోంది. విద్య, వైద్యంపై సీఎం కేసీఆర్ ప్రధాన ఫోకస్ పెట్టారు. మంత్రి హరీశ్ రావు నేతృత్వంతో వైద్యారోగ్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు పెరిగాయి. సుస్తి చేస్తే సర్కారీ దవాఖాను పోయి చూపించుకుంటున్నారు జనం. ఇటు విద్యారంగంలో కూడా పెను మార్పులు వస్తున్నాయి. కార్పోరేట్ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి కార్పొరేట్ స్కూళ్ల మాదిరిగానే సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్ అందించాలని పాఠశాల విద్యాశాఖ డిసైడయ్యింది.
5 కొత్త డిజైన్లతో పిల్లలకు యూనిఫామ్స్ ఇవ్వనున్నారు. ఎనిమిది నుంచి ఆపై తరగతుల అబ్బాయిలకు ప్యాంట్లు, కింది తరగతుల వారికి నిక్కర్లు ఉంటాయి. 1 నుండి 3 తరగతి వరకు ఉన్న బాలికలకు చెక్డ్ షర్ట్, రెండు జేబులతో కూడిన మెరూన్ స్కర్ట్ ఉంటుంది. ఆపై తరగతుల వారికి కుర్తా, మెరూన్ పైజామాపై మెరూన్ వెయిస్ట్‌కోట్ ఉంటుంది. మొత్తం 26 వేల స్కూళ్లలోని 25 లక్షల స్టూడెంట్స్‌కు యూనిఫామ్ అందించనున్నారు. ఇందుకోసం సుమారు రూ.145 కోట్లు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం.
1-8 క్లాసుల స్టూడెంట్స్‌కు అయ్యే వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 రేషియోలో ఖర్చును భరిస్తాయి. తొమ్మిది, పది తరగతుల వారితోపాటు KGBV, ఆదర్శ పాఠశాలల్లో 12వ తరగతి వరకు స్టూడెంట్స్‌కు పూర్తిగా రాష్ట్ర నిధులతో ఇస్తారు. స్కూల్స్ రీ ఓపెన్ నాటికే వాటిని విద్యార్థులకు అందించాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికే వస్త్ర సేకరణకు టెస్కోకు ఆర్డర్ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..