Government Holidays 2022: రాబోయే ఏడాదికి గానూ పండుగలు, సెలవుల తేదీలను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన జీవోను జారీ చేసింది. 2022 సంవత్సరంలో పండుగలు, ఇతర సెలవుల జాబితాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే ఏడాది 28 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులను గుర్తించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం 23 రోజులు సాధారణ సెలవులుగా ప్రకటించారు. ముఖ్యమైన సెలవులు జనవరి 1 నూతన సంవత్సరం, 15 సంక్రాంతి, 26 గణతంత్రదినోత్సవం, మార్చి 1 మహాశివరాత్రి, 18 హోళీ, ఏప్రిల్ 2 ఉగాది, 10 శ్రీరామనవమి, 14 అంబేడ్కర్ జయంతి, 15 గుడ్‌ఫ్రైడే, మే 3, 4 రంజాన్, ఆగస్టు 15 స్వాతంత్య్రదినోత్సవం, సెప్టెంబరు 25 బతుకమ్మ ప్రారంభరోజు, అక్టోబరు 5 విజయదశమి, 9 మిలాద్-ఉన్-నబి, 25 దీపావళి, డిసెంబరు 25 క్రిస్‌మ్‌సగా పేర్కొన్నారు. కాగా, వారాంతపు సెలవు దినం అయిన ఆదివారం నాడు ఆరు సెలవు దినాలు రావడం గమనార్హం.
2022 సెలవులు, పండుగలు ఇవే..Telangana Government holidays 2022