Telangana Cabinet: తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి డిసెంబర్ 3న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర గవర్నర్ తమిళిసై రేవంత్‌తోపాటు పలువురు మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే, మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉదయం శాఖలను కేటాయించింది. మంత్రులకు శాఖల కేటాయింపు జరిగినట్లు ప్రచారం జరిగినా.. అదేం లేదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రమాణం చేసిన మూడో రోజుల తర్వాత మంత్రులకు శాఖలను కేటాయించింది.
మల్లు భట్టి విక్రమార్క – డిప్యూటీ సీఎం, ఫైనాన్స్
ఉత్తమ్ కుమార్ రెడ్డి – సివిల్ సప్లయ్, నీటి పారుదలశాఖ
దామోదర రాజనర్సింహ – ఆరోగ్యశాఖ
శ్రీధర్ బాబు – ఐటీ, శాసనసభ వ్యవహారాలు
కోమటిరెడ్డి వెంకటరెడ్డి – ఆర్ అండ్ బి
తుమ్మల నాగేశ్వరరావు – వ్యవసాయ శాఖ
జూపల్లి కృష్ణారావు – ఎక్సైజ్ శాఖ
పొంగులేటి శ్రీనివాసరెడ్డి – సమాచార శాఖ
కొండా సురేఖ – అటవీ శాఖ
పొన్నం ప్రభాకర్ – రవాణా శాఖ
సీతక్క – పంచాయితీ రాజ్
తెలంగాణ మూడో అసెంబ్లీ మొట్టమొదటి సమావేశం ఈ ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం కానుంది. కొత్తగా ఎన్నికైన సభ్యులు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేస్తారు. ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన అక్బరుద్దీన్ ఒవైసీ ఇప్పటికే రాజ్‌భవన్‌లో ప్రమాణం చేసారు. గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు MIM ఎమ్మెల్యేలు, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ హాజరయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..